గ్లోబల్ స్టార్ కు అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా..!!

murali krishna
ప్రస్తుతం టాలీవుడ్ గురించి ప్రపంచం మొత్తం చెప్పుకుంటోంది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కల్కి.. వంటి పాన్ ఇండియా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా రేంజ్‌ను పెంచాయి. ఆ సినిమాలకే కాకుండా అందులో నటించిన హీరోలకు కూడా అంతే గుర్తింపు లభిస్తోంది.ఆ గుర్తింపుతోనే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆర్గనైజర్స్ తెలుగు హీరోలకు అరుదైన అవకాశాలను కల్పిస్తోంది.ఇప్పటి వరకు వేరే ఇండస్ట్రీలకే పరిమితమైన ఈ గౌరవం.. ఇప్పుడు తెలుగు హీరోలకు సైతం దక్కడం విశేషంగానే చెప్పాలి… తాజాగా ప్రముఖ టాలీవుడ్‌ హీరోకు ఇలాంటి అవకాశమే వచ్చింది. లండన్‌లో గౌరవం దక్కించుకున్న ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దా.మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. తనదైన నటన, డ్యాన్సులు, ఫైట్లతో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు రామ్ చరణ్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇందులో అతను చేసిన డ్యాన్సులు, ఫైట్స్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టాయి. ఇలా సినిమాల్లో గ్లోబల్ స్టార్ గా ఓ రేంజ్ లో వెలిగిపోతోన్న రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కనుందని సమాచారం. అదేంటంటే.. లండన్ లోని ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారట. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ పాపులారిటీ, ఫాలోయింగ్ ను గమనించిన మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తీసుకున్నారట.కాగా మేడమ్ టుస్పాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసే రామ్ చరణ్ మైనపు విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉండనున్నట్లు. అదేమిటంటే.. రామ్‌చరణ్‌ ఫ్రెంచ్‌ బార్బేట్‌ జాతికి చెందిన కుక్క పిల్ల రైమ్‌ను తనతో పెంచుకుంటున్నారు.

ఎక్కడికి వెళ్లినా రైమ్‌ను తీసుకెళ్లడం రామ్‌చరణ్‌ దంపతులకు అలవాటు. అందుకే ఇప్పుడు కూడా రైమ్‌ను ఎత్తుకుని ఉన్న రామ్‌చరణ్‌ మైనపు బొమ్మనే మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేయనున్నారని సమాచారం. దీనికి సంబంధించి అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.గేమ్ ఛేంజర్ సినిమాలో తన షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న రామ్‌చరణ్‌ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇటీవల ఫ్యామిలీతో కలసి అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు వెళ్లిన రామ్‌చరణ్‌… అక్కడ నుండి స్పెషల్ ప్లైట్‌లో లండన్ చెక్కెశాడు. ఈ లండన్‌ టూర్‌కి ప్రధాన కారణం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆహ్వానమే అంటున్నారు. దాదాపు 2 వారాలు హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయాలని భావించిన రామ్‌చరణ్‌ పనిలోపనిగా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం తయారు చేస్తున్న మైనపు బొమ్మకు అవసరమైన కొలతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) నుంచి కొంత మంది స్టార్ హీరోల మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అయితే... అవి అన్నీ వేర్వేరు దేశాల్లో ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైమ్... లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఒక తెలుగు హీరో మైనపు విగహాన్ని ఏర్పాటు చేయనున్నారు.మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అడుగు పెట్టిన మొదటి తెలుగు హీరో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన మైనపు విగ్రహం బ్యాంకాక్ మ్యూజియంలో పెట్టారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం ఉంది. ఆ మ్యూజియంలోనే అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సైతం ఉంచారు. ఆమె నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'మిస్టర్ ఇండియా'లో గెటప్ తీసుకుని ఆ విగ్రహం రూపొందించారు. తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మ సైతం అక్కడే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: