ఆ హీరోకి గేలమేసిన మృణాల్‌ ఠాకూర్.. ఇంత సీక్రెట్ దాగుందా?

Suma Kallamadi
అందాల తార మృణాల్‌ ఠాకూర్ గురించి తెలుగు కుర్రకారుకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సీతారామం సినిమాతో మృణాల్ ఇక్కడ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగులో వరుస ఆఫర్లు క్యూలు కట్టినప్పటికీ, అమ్మడు ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకి సాగిపోతుంది. ఆమధ్య రిలీజైన కల్కి సినిమాలో ఈ ముద్దుగుమ్మ కేమియో రోల్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈ అమ్మడు తాజాగా ఓ సినిమా గురించి మాట్లాడుతూ, అందులో చేసిన హీరోని పొగుడుతూ ఆకాశానికెత్తేసింది.
సందీప్‌ వంగ దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌’ మూవీ గురించి జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఏ రేంజ్‌లో విజయం నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ రికార్డ్ నమోదు చేసింది. తెలుగుతో పాటుగా, బాలీవుడ్‌తో కూడా రికార్డు కలెక్షన్లను రాబట్టిందీ మూవీ. ఇక తాజాగా ప్రకటించిన ఐఫా అవార్డు సైతం ఈ సినిమాకి దక్కడం విశేషం. అబుదాబి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ చిత్రంతో పాటు పలు విభాగాల్లో యానిమల్‌ అవార్డులను సొంతం చేసుకుంది.
అయితే తాజాగా అందాల ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌.. హీరో రణ్‌బీర్‌ కపూర్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విషయం ఏమిటంటే, తాజాగా జరిగిన ఐఫా వేడుకమీద మృణాల్‌ మాట్లాడుతూ.. అందరూ యానిమల్‌ సినిమాలో రణ్‌బీర్‌ పాత్ర ఎంతో క్రూరంగా ఉన్నదని విమర్శిస్తున్నారు. అయితే ఇదే రణ్‌బీర్‌ 2012లో నటించిన బర్ఫీలో చెవిటి-మూగ వ్యక్తిగా నటించిన విషయాన్ని మర్చిపోవద్దు. అప్పుడు అమాయకుడిగా.. ఇప్పుడు యానిమల్‌గా 2 విభిన్న పాత్రలను అద్భుతంగా రణ్‌బీర్‌ తెరపై పండించాడు. అంత వేరియేషన్ మరే హీరో కూడా చూపించలేడు.. అంటూ రణ్‌బీర్‌పై ప్రశంసలు కురిపించిందీ భామ. ఇక యానిమల్ సినిమాలో మితిమీరిన వయలెన్స్‌ ఉందని. ఈ స్థాయిలో అరాచకం అవసరమా? అంటూ కొందరు సో కాల్డ్ క్రిటిక్స్ ఈ సినిమాపై విమర్శలు చేసిన సంగతి విదితమే. ఈ నేపధ్యంలో యానిమల్‌ మూవీకి మద్ధతుగా నిలిచింది మృణాల్. అయితే ఈ పొగడ్తల వెనుక అమ్మడు అతనితో నటించాలనే కోరికను ఇండైరెక్టుగా బయటపెట్టిందని కొందరు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: