నీకు కొవ్వు ఎక్కువ అంటూ మంచు లక్ష్మి కి ఇచ్చి పడేసిన జగపతిబాబు..!

Amruth kumar
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జగపతిబాబు ప్రస్తుతం సినిమాల్లో విలన్ గా నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోలతో కలిసి పని చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దాదాపు 100 సినిమాకు పైగా నటించి ఏడు నంది అవార్డులను కూడా అందుకున్నారు.  ప్ర‌స్తుతం జగపతి బాబు ద‌గ్గ‌ర నూంచి త‌న కొత్త సినిమాల‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న లేదు.
సోషల్ మీడియాలో కూడా జగపతిబాబు ఎంతో చురుగ్గా ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా తన మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గురించి సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆయన ఉదయం నిద్ర లేచిన దగ్గరనుంచి వ్యాయామం చేసే వరకు ఎలాంటి ఆహారం తీసుకుంటారో అన్ని వివరించారు. కాకరకాయ జ్యూస్, బెండకాయ జ్యూస్ పెరుగు అన్నం ఎలా తన మార్నింగ్ రొటీన్ ని కూడా వివరించారుఇక ఆ వీడియోని చూసిన మంచు లక్ష్మి బెండకాయ జ్యూస్ ఎందుకు అంటూ ఆ వీడియో కింద కామెంట్ పెట్టింది. ఇక దానికి జగపతిబాబు రిప్లై ఇస్తూ లక్ష్మీ బెండకాయ రసం కొలెస్ట్రాల్ కి చాలా మంచిది.
నాకు కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చాలా అవసరం’’ అని రిప్లై ఇచ్చినట్టు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. కానీ అది జగ్గూబాయ్ పెట్టాడా లేక పెట్టి డిలీట్ చేశాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇక మంచు లక్ష్మి కూడా ‘‘నాకు అన్నీ బాగానే ఉన్నాయి అన్నో. మెంటల్ ఇష్యూస్ తప్ప ఇంకా ఏమీ లేదు’’ అని సమాధాన మిచ్చింది. మంచు లక్ష్మి, జగ్గూబాయ్ చాట్‌ను నెటిజన్లు స్క్రీన్ షాట్ తీసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. కానీ ఈ విషయం తెలిసిన నెటిజన్లు మంచు లక్ష్మిని అంత మాట అన్నాడా? అని షాక్ అవుతున్నారు.ఇక దీనిపై మంచి లక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: