రైటర్ గా సూపర్ హిట్ సినిమాలు అందించిన కొరటాల శివ డైరెక్టర్ గా మారి మిర్చి నుంచి లేటెస్ట్ గా వచ్చిన దేవర వరకు తన పెన్ పవర్ చూపిస్తున్నాడు. భరత్ అనే నేను తర్వాత కొరటాల శివ చిరు, చరణ్ తో కలిసి ఆచార్య సినిమా చేశారు. కథ రాసుకోవడం వరకు ఓకే కానీ ఎందుకో మెగా మల్టీస్టారర్ గా తీసిన ఆచార్య ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయింది. తప్పు ఎవరిదైనా సరే ఫలితం అందరు అనుభవించారు.ఆచార్య తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో ఎన్టీఆర్ తో దేవర సినిమా చేశాడు కొరటాల శివ. ఈ సినిమాను రెండు భాగాలుగా ఫిక్స్ చేశారు. దేవర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన ఆడియన్స్ మిశ్రమ స్పందన ఇస్తున్నారు. ఐతే ఆచార్య తరహాలోనే దేవర కథ నడవడం ఆశ్చర్యకరంగా ఉంది. స్టార్ హీరోల కోసం వరల్డ్ బిల్డింగ్ బాగానే చేస్తున్న కొరటాల శివ అందులో ఎమోషన్స్ ఇంకా లాజిక్స్ మిస్ అవుతున్నాడని అనిపిస్తుంది.కొరటాల శివ డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా మిర్చి మాస్ హిట్ అందుకుంది. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ రెండు క్లాస్ సినిమాలే కానీ ఫ్యాన్స్ కి బాగా ఎక్కేశాయి. మహేష్ తో తీసిన భరత్ అనే నేను కూడా తన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో హిట్ కొట్టాడు. అలా మామూలు కథలకే అంత వర్క్ చేసిన కొరటాల శివ దేవర రత్నగిరి అంటూ ఏర్పాటు చేసి ఆ కథను రొటీన్ రెగ్యులర్ పంథాలో నడిపించడం కొందరికి నచ్చలేదు.ఈ నేపథ్యంలో కొరటాల శివ రాసిన రొటీన్ స్టోరీ, అందించిన పూర్ డైరెక్షన్ ఈ మూవీకి పెద్ద మైనస్ అయ్యాయని అంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ కూడా చాలా స్లోగా నడుస్తుంది స్క్రీన్ ప్లే కూడా పెద్దగా ఆకట్టుకునేలాగా ఉండదు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు బాగుండటం వల్ల ఫస్టాఫ్ యావరేజ్ గా మాత్రమే నిలిచింది.
"ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది, పర్లేదు, సెకండాఫ్ బాగుంటుందేమో" అని ప్రేక్షకులు అనుకున్నారు కానీ కొరటాల శివ పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. సెకండాఫ్ చాలా బోరింగ్‌గా ఉండటం వల్ల ప్రేక్షకులకు విరక్తి పుట్టింది. సెకండాఫ్ మొత్తంలో స్టాండ్ ఔట్ అయ్యే ఒక్క మూమెంట్ కూడా లేకపోవడం ఈ మూవీకి పెద్ద ఎదురుదెబ్బ అయింది. దేవర పార్టు 2లో మిగతా కథ చూపించాలనే ఉద్దేశంతో సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ లేకుండా బోరింగ్ గా తీసినట్లు అనిపించింది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఏదో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలి కదా అన్నట్లు బలవంతంగా జొపించ్చినట్లు ఉంది. కొరటాల శివ చేసిన ఈ తప్పుల వల్లే దేవర సినిమాకి ఎన్ని పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయో అదే సంఖ్యలో నెగటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. నెగిటివ్ టాక్ వినిపిస్తుందంటే దానికి ప్రధాన కారణం కొరటాల శివ చేసిన ఈ చిన్న తప్పులే. వీటిని సరిచేసుకొని ఉన్నట్లయితే ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయ్యేది. అలానే, ఈ సినిమాలో ఫస్టాఫ్ స్టోరీని సెకండాఫ్ లో పెట్టి సెకండాఫ్ స్టోరీని ఫస్టాఫ్ లో పెట్టి ఉంటే బాగుండేది. అలా స్వాప్ చేసినా ఒక ఎలివేషన్ అనేది వచ్చేది, ప్రేక్షకులు తృప్తిగా థియేటర్ల నుంచి బయటికి వచ్చేవారు.ఓవరాల్ గా ఆచార్య తర్వాత టెస్ట్ లో పాసైనా సరే కొరటాల శివ మార్క్ మిస్ అయ్యాడన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు కొరటాల శివ సినిమాలు చాలా స్లో నరేషన్ ఉంటుందన్న టాక్ ఉంది. కథకు ఆడియన్స్ కనెక్ట్ అయితే అది వాళ్లకు ఎక్కుతుంది అదే కనెక్ట్ అవ్వకపోతే మాత్రం పెదవి విరవక తప్పట్లేదు. దేవర 1 తో ఎలాగు ఇలా కానిచ్చేసిన కొరటాల శివ దేవర 2కి తన పంథా మారుస్తాడా లేదా అన్నది చూడాలి. మామూలుగా తన సినిమాలకు కొరటాల శివకే ఎక్కువ మార్కులు పడేలా చేసుకునే ఆయన దేవర విషయంలో ఎన్టీఆర్ ఆ తర్వాత అనిరుద్ కు మార్కులు పడేలా చేసుకున్నాడు. కొరటాల శివ మీద మాత్రం ఆడియన్స్ కాస్త అసంతృప్తిగానే ఉన్నారు.