ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు దేవర. గత కొద్ది రోజులుగా ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక విషయం వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కో వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.ఈ నేపథ్యంలో అభిమానుల అంచనాలకు , ఎదురుచూపులు ఏమాత్రం తీసిపోని రీతిలో సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దేవర క్రేజ్ మాములుగా లేదు. ఇక USAలో కూడా ప్రీ సేల్స్ లో రోజుకో రికార్డుని నమోదు చేస్తుంది. నార్త్ అమెరికాలో 'దేవర' ప్రీ సేల్స్‌లో ఏకంగా 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను అలవోకగా దాటేసింది. ఇక ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా 21 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు నమోదయ్యయ్యయి. అంటే దాదాపు 4 లక్షల 95 వేల టిక్కెట్లు ఈ సినిమాకి బుక్ అయ్యాయి అన్నమాట. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని మేకర్స్ భావిస్తున్నారు. అలాగే తాజాగా ఇంకో అదిరిపోయే రికార్డుని సృష్టించింది. ఈ సినిమాకి యూఎస్ఏ ప్రీమియర్ సేల్స్ లో ఏకంగా 75 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని మూవీ టీం తెలియజేసింది. దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఈ రికార్డుతో దేవర రికార్డుల ఊచకోత కోయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ .ఈ నేపథ్యంలో భ్రమరాంబ, మల్లిఖార్జున థియేటర్లు నందమూరి కుటుంబానికి సొంత థియేటర్ల లాంటివి. బాలయ్య సినిమా బెన్ఫిట్ షో పడిందంటే ఆయన స్వయంగా వెళ్లి మరీ సినిమాను వీక్షించే థియేటర్లు ఇవి. నందమూరి హీరోల సినిమాలకు ఈ థియేటర్ల ముందు ఫ్యాన్స్ చేసే సెలబ్రేషన్స్ మాములుగా ఉండవు. బాలయ్య, ఎన్టీఆర్ సినిమాలు విడుదలైన ప్రతీ సందర్భంలో ఈ రెండు థియేటర్ల ముందు పెద్ద పండగ వాతావరణమే కనిపిస్తుంటుంది. అలాంటి థియేటర్లలో 'దేవర' బెన్ఫిట్ షో పడే పరిస్థితి లేకపోవడం ఎన్టీఆర్ అభిమానులను నిరాశకు గురిచేసిన విషయం. ఇదిలావుండగా ఈ రెండు థియేటర్లలో 'దేవర' మిడ్ నైట్ 1 am షో క్యాన్సిల్ కావడం ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కారణం ఇది అని థియేటర్ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాచారం లేదు. థియేటర్ ముందు మాత్రం 1 am షో రద్దుకు సంబంధించి ఒక బోర్డ్ పెట్టేశారు. థియేటర్ యాజమాన్యానికి, దేవర సినిమా డిస్ట్రిబ్యూటర్కు మధ్య గొడవల మూలానే షో క్యాన్సిల్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.