మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు.నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించిన దేవర మూవీసెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది.ఇదిలావుండగా దేవర. సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపించనున్నారు. దేవర, వర పాత్రల్లో తారక్ కనిపించనుండగా గతంలో తారక్ తండ్రీకొడుకులుగా ఆంధ్రావాలా, శక్తి సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు. ఆ సినిమాలలో ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్ర చనిపోతుంది. అయితే దేవర సినిమాకు ఆంధ్రావాలాతో పోలిక వస్తున్న నేపథ్యంలో కొరటాల శివ స్పష్టత ఇచ్చారు. దేవర సినిమాలో హీరో తండ్రికొడుకుల పాత్రల్లో నటించినంత మాత్రాన ఆంధ్రావాలా కథ దేవర కథ ఒకటే అంటే ఎలా అని అన్నారు.తండ్రి కొడుకులుగా హీరో ద్విపాత్రాభినయం చేయడం ఇప్పుడు వస్తున్న ట్రెండ్ కాదు. ఎప్పటి నుంచో హీరోలు నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్ నటించగానే ఆంధ్రావాలాతో పోల్చడం ఏంటి, అసలు ఆ కథకు ఈ కథకు పోలిక ఎలా ఉంటుంది. ఏ తండ్రి కొడుకుల కథ వచ్చినా ఆ సినిమా కథే అనుకుంటే ఎలా అంటూ కొరటాల శివ ప్రశ్నించారు. ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. ఆంధ్రావాలతో ఈ సినిమాను పోల్చాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోలు తండ్రి కొడుకులుగా నటించారు. అందులో చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కనుక దేవర సినిమా గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు అన్నట్లు దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో నెగిటివ్ కామెంట్లు చేయడం వేరని ద్వేషించడం వేరని కొరటాల శివ పేర్కొన్నారు. కొరటాల శివ దేవర సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారు. దేవర సినిమాకు బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.