తెలుగు వర్సెస్ కన్నడ.. బిగ్ బాస్ ని కూడా వదలట్లేదు..!

shami
బిగ్ బాస్ సీజన్ 8 లో ఎప్పుడు లేనిది తెలుగు వాళ్లు.. కన్నడ వాళ్లు అనే వాదన వినిపిస్తుంది. అఫ్కోర్స్ అది హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య కాదు అక్కడ వారికి సపోర్ట్ ఇచ్చే ఆడియన్స్ లో ఈ చర్చ మొదలైంది. ఈ సీజన్ లో మేల్, ఫిమేల్ అనే తేడా లేకుండా అందరు సమానంగా ఆడుతున్నారు. ఐతే వారిలో కొందరు ముందంజలో ఉన్నారు కొందరు వెనక ఉన్నారు. ఐతే కొందరు స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో నెగిటివిటీ చేసేందుకు భాష ని తీసుకొస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో ఎక్కువమంది సీరియల్ యాక్టర్స్ ని తీసుకున్నారు. ఐతే వారిలో కన్నడ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. నిఖిల్, ప్రేరణ, యష్మి వీళ్లంతా కన్నడ నటీనటులే. తెలుగు బిగ్ బాస్ లో వాళ్లు ఎందుకు అంటే మన వాళ్లు దొరక్క అని కాదు వాళ్లు మన తెలుగు వాళ్లలానే అని అంటున్నారు. వాళ్లు కూడా తెలుగుని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు.
ఐతే ఈ సీజన్ లో తెలుగు అమ్మాయిలైన సీత, సోనియా, విష్ణు ప్రియ ఉన్నారు. ఆట లో ఎవరు బాగా ఆడితే వారికి ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది. మన వాళ్లైనా సరే ఆట సరిగా ఆడకపోతే సపోర్ట్ ఉండదు. ఇదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. బిగ్ బాస్ 8 లో కొందరు కన్నడ నటులకు సపోర్ట్ గా ఉంటున్నారని ఇలా అయితే మన తెలుగు వాళ్లకి టైటిల్ రాదని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో మగ ఆడ తేడానే లేదు మరి అలాంటిది బాష ఉంటునా.. దీనికి అనరు ఎలిజిబుల్ అనే వాళ్ల ఎంపిక జరిగింది. మరి ఈ గొడవ ఇంతటితో ఆపితే బెటర్ అని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: