పెట్రోల్ అవసరం లేదు.. ఛార్జింగ్ పెట్టే పని లేదు.. ఈ స్కూటీ వెరీ స్పెషల్?

frame పెట్రోల్ అవసరం లేదు.. ఛార్జింగ్ పెట్టే పని లేదు.. ఈ స్కూటీ వెరీ స్పెషల్?

praveen
ఇటీవల కాలంలో మార్కెట్లో  బజాజ్ కంపెనీ సరికొత్త రీతిలో ఎలక్ట్రికల్ స్కూటర్లను తీసుకువస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల స్కూటర్లు మార్కెట్లోకి తీసుకురాగా.. ఇక ఇప్పుడు ఆ కంపెనీ స్వాసబుల్ బ్యాటరీ మోడల్ కోసం కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇలాంటి మోడల్ పైన ఈ కంపెనీ పని చేస్తుందని ఎన్నో రోజులుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇది స్వాసబుల్ లేదా రిమూవబుల్ బ్యాటరీలతో కూడిన ఎలక్ట్రికల్స్ స్కూటర్. అయితే దీనిని సపరేట్గా ఒకచోట పెట్టి బ్యాటరీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. చార్జింగ్ స్టేషన్లో మీరు బ్యాటరీ మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

 ఇప్పటికే భారత మార్కెట్లో బజాజ్ ఈ స్కూటర్, ఓలా ఎలక్ట్రిక్, ఎనర్జీ, టీవీఎస్ ఐక్యూ లాంటి మోడల్స్ తో పోటీ పడుతుంది అని చెప్పాలి. అయితే ఈ కొత్త మోడల్ స్కూటర్ గురించి ఆ కంపెనీ యొక్క సీనియర్ అధికారి మాట్లాడుతూ.. మార్కెట్లో చార్జింగ్ స్టేషన్లోని తీసుకొచ్చేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయా చార్జింగ్ స్టేషన్లకు వెళ్లి బ్యాటరీని స్వాప్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అంటూ తెలిపారు.


స్కూటీ లో ఉన్న బ్యాటరీ ని తీసి అక్కడ ఇచ్చేసి మరో బ్యాటరీని అందులో పెట్టుకుని వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశం ద్వారా ప్రత్యేకం గా చార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. అయితే ఇక అన్ని ఎలక్ట్రికల్ స్కూటర్లకు ఉన్నట్లుగానే బ్యాటరీని ఇంటి దగ్గర కూడా చార్జింగ్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వబోతుందట. అయితే ఈ కొత్త మోడల్ స్కూటీ కోసం అటు కస్టమర్లు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. కాగా ఇప్పటికే బజాజ్ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రికల్ స్కూటీల ధర లక్ష రూపాయలకు పైగానే ఉంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: