మహిళలకు పీరియడ్ ప్యాంటీలు ఉత్తమ ఎంపిక.. ఇక లీకేజ్ కి ఛాన్సే లేదు..!

lakhmi saranya
భారతదేశంలో సామాన్యంగా మహిళలకు పీరియడ్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి మహిళకి వచ్చే సమస్య ఇది. పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ అనేది మరి కొంతమందికి లీకేజ్ అవుతూ ఉంటుంది. అలా లీకేజ్ అయ్యేవారు వీటిని తప్పకుండా వాడండి. ప్రతి మహిళా ఎదుర్కునే సమస్యల్లో పీరియడ్స్ ఒకటి. ప్రతి నెల ఆడపిల్లలు ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు. ఆడవాళ్లలో జరిగే ఈ బుతుస్రావం అనేది సహజమైన జీవ ప్రక్రియ. ఇది సాధారణంగా నెలకు ఒక్కసారి జరుగుతుంది.
రక్తస్రావం కోసం అందరూ ప్యాడ్స్, శ్యానిటరీ న్యాప్ కిన్లు ఉపయోగిస్తుంటారు. దీంతో కొంతమందికి ర్యాషెస్ వస్తాయి. అధిక రక్తస్రావం కారణంగా లీకేజీ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ ప్రాబ్లమ్ కు చెక్ పెట్టేలా తాజాగా పీరియడ్ ప్యాంటీలు అతి తక్కువ ధరకే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. పీరియడ్ ప్యాంటీ లను ఉపయోగిస్తే చాలు కంఫర్ట్ గా ఉంటుంది. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పీరియడ్ ప్యాంటీల్లో నాలుగైదు పోరలుంటాయి... చూడానికి ప్యాంటీల్లాగే కనిపిస్తాయి. ఇది బ్లడ్ ను ఈజీగా పీల్చుకుంటాయి.
 సాధారణమైన ప్యాడ్స్ తో రెండింటితో సమానం ఇవి. మరో ప్యాడ్ వాడాల్సిన పని కూడా ఉండదు. ఉబ్బెత్తుగా, అసౌకర్యంగా ఉండవు. 12 గంటల వరకు ఒక ప్యాడ్ వాడితే సరిపోతుంది. పీరియడ్ ప్యాంటీల్లో ఎక్కువ, తక్కువ ధరలు కరిగి ఉంటాయి. ఎక్కువ నాణ్యత కలిగినవి అయితే అధిక ధరతో పాటు మూడేళ్ల వరకు యూజ్ చేయవచ్చు. పాఠశాలకు వెళ్లే పిల్లలు పీరియడ్స్ సమయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. తరగతి గది నుంచి వెళ్లి బ్యాట్ చేంజ్ చేసుకోవడానికి కూడా రిస్క్ అనిపిస్తుంది. కాదా టీనేజ్ పిల్లలకు పీరియడ్ ప్యాంటీలు ఎంతో మేలు చేస్తాయని చెప్పొచ్చు. వీటిలో రక్త స్రావానికి తగ్గట్టు హెవీ, మీడియం, లో ఫ్లో రకాలుఉంటాయి కాబట్టి స్కూళుకెళ్లే పిల్లలు హ్యాపీగా ఇవి వాడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: