ఆ సినిమాల్లో ఎందుకు నటించానో నాకే తెలీదు.. మహేష్ షాకింగ్ కామెంట్స్..!!

murali krishna
నట శేఖర కృష్ణ ఇండస్ట్రీని ఏలుతున్న రోజుల్లోనే అతని నట వారసుడు ఎంట్రీ ఇచ్చారు. ఆరేడేళ్ల వయసులోనే కెమెరా ముందుకొచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడిగా నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. హీరోగా మహేష్ బాబు రాజకుమారుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా.. అంతకు ముందు బాల నటుడిగా చాలా సినిమాల్లో నటించారు మహేష్ బాబు. కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు, గూడఛారి 117 ఇలా చాలా సినిమాలున్నాయి.ఇదిలావుండగా రాజకుమారుడు మహేష్ బాబుకి తొలిచిత్రం అయినా.. అంతకు ముందు అంటే 1979 ‘నీడ’ సినిమా నుంచి చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించారు మహేష్ బాబు. నీడ, పోరాటం, శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూడఛారి 117, కొడుకుదిద్దిన కాపురం, అన్నా తమ్ముడు, బాలచంద్రుడు ఇలా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు మహేష్ బాబు. అయితే ఈ సినిమాల్లో చాలా వరకూ తండ్రి కృష్టతోనే కలిసి నటించారు. కృష్ణకి కొడుకుగాతమ్ముడిగా ఫ్రెండ్‌గా కూడా నటించారు మహేష్ బాబు.అయితే 1990లో వచ్చిన ‘బాలచంద్రుడు’ సినిమానే మహేష్ బాబుకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా చివరి సినిమా.ఈ నేపథ్యంలో ఆ రోజులను గుర్తు చేసుకుంటూ మహేష్ ఓ ఇంటర్వూలో మాట్లాడారు.మహేష్ మాట్లాడుతూ అసలు స్టార్ కావాలని ఎప్పుడు అనిపించింది అంటే అది నాన్నగారే డిసైడ్ చేసారు. చిన్నప్పుడు హాలీడేస్ అప్పుడు సినిమాలు చేయించేవారు.ఆయన. ఏప్రియల్, మే నెలలో ఓ సినిమా చేసేవాళ్లం. అలా ఆరేడేళ్లు వరసగా సినిమాలు శెలవుల్లో చేస్తూ వచ్చాను. అవి బాగానే ఆడాయి అప్పుడు. అంటే వాటితో నాకు అసలు సంభందం లేదు. ఎందుకు ఆడాయో నాకు అసలు తెలియదు.యాక్ట్ చేయమంటే చేసాను. అలా చేస్తూంటే ఒక్క సినిమా మాత్రం జూన్, జూలై కు వెళ్లింది షూటింగ్ . దాంతో స్కూల్లో ఒక ఏడాది పోయింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే సరే ఇంక సినిమాలు వద్దు వెళ్లి చదువుకో. చదువు అంతా అయ్యిపోయినాక వచ్చి సినిమాల్లో చేద్దువుకానీ. సరే నాన్నా అన్నాను అలాగే అయ్యింది అంటూ తన హీరో ఎంట్రీ జరగటానికు ముందు రోజులు చెప్పుకొచ్చారు ఓ ఇంటర్వూలో మహేష్ బాబు.ఇదిలా ఉంటే మహేశ్‌బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాపై ప్రతీ అప్డేట్‌ టాలీవుడ్‌ను ఊపేస్తోంది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, సినిమాలో తన లుక్‌ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాడు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: