'ఆయ్' అంటూ బ్లాక్ బస్టర్ కొట్టిన ఎన్టీఆర్ బావమరిది..!!

murali krishna
మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మ్యాడ్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న నార్నే నితిన్ ‘ఆయ్ ‘ అంటూ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అంజి కె మణిపుత్ర తెరకెక్కంచిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో నయన్‌ సారిక హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ‘ఆయ్‌’ సూపర్ హిట్ గా నిలిచింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ సుమారు రూ. 20 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ ఆయ్ సినిమా ఈ కలెక్షన్లు రాబట్టడం విశేషం. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ స్వచ్చమైన ప్రేమకథను చూసి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రష్మిక మందన్న తదితర సినీ ప్రముఖులు ఆయ్ సినిమా టీమ్ ను మెచ్చుకున్నారు.ఈ నేపథ్యంలో  ఆయ్’ చిత్రానికి రూ.4.1 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.7.12 కోట్లు షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.2.72 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ నేపథ్యంలో కథ విషయానికొస్తే ఆయ్ సినిమా రెగ్యులర్ లవ్ స్టోరీగానే మొదలవుతుంది. కానీ గోదావరి జిల్లాల నేటివిటీ చుట్టూ కథను అల్లుకొని ఎక్కడా కథనంపై పట్టు సడలకుండా దర్శకుడు అంజి కే మణిపుత్ర స్టోరిని చెప్పిన విధానమే సినిమాను పరుగులు పెట్టించింది. ఇక కసిరెడ్డి రాజ్ కుమార్ , అంకిత్ కోయతో డైలాగ్ డ్రామాను నడిపించిన విధానం బాగుంది. ఆద్యంతం స్టోరీలో ఫ్లేవర్ మిస్ కాకుండా కామెడీతో లవ్ ట్రాక్‌ను నడిపించిన విధానం దర్శకుడు ప్రతిభకు అద్దం పట్టింది. ఇక క్లైమాక్స్ రొటిన్‌గా ఉంటుందా? అని ఫిక్స్ అయిన ఆడియెన్స్‌కు 25 నిమిషాల ఎమోషనల్ డ్రామాను అద్బుతంగా పడించాడు. లవ్ ట్రాక్‌ను పక్కకు తప్పించి..ఫ్రెండ్ షిప్ ట్రాక్‌ను హైలెట్ చేయడంతో కథ సక్సెస్ జోన్‌లోకి వెళ్లేలా దర్శకుడు తన టాలెంట్‌ను ప్రదర్శించాడు.ఇదిలావుండగా ఆయ్ సినిమా విజయానికి మరో ప్రధాన కారణం పాటలు. ఈ సినిమాకు రామ్ మిరియాల అందించిన స్వరాలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా రంగనాయకి సాంగ్ కు యూట్యూబ్ షేక్ అవుతోంది. అలాగే సూఫియానా, డైవర్షన్ బ్యూటీ సాంగ్స్ సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: