గేమ్ ఛేంజర్ : ఆ స్టార్ హీరో సర్ప్రైజింగ్ కామియో.. ఫ్యాన్స్ కి పూనకాలే..?

murali krishna
శంకర్ డైరెక్ట్ చేస్తోన్న గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సునిల్, అంజలి, ఎస్. జే సూర్య తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ తమన్ .. శంకర్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని చెబుతున్నారు. ఒకటి ఐఏఎస్.. మరోటి పొలిటీషియన్ గా వినిపించింది. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పబోతున్నారు అనుకోవచ్చు. బట్ శంకర్ భారతీయుడు 2 చూసిన తర్వాత ఫ్యాన్స్ ఈ గేమ్ ఛేంజర్ పై మరీ ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఏం పెట్టుకోవడం లేదు అనేది నిజం. ఈ నేపథ్యంలో సినిమా స్టార్ట్ అయి 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికి ఒక్క పాట , రెండు పోస్టర్స్ తప్ప ఏవి కూడా బయటకు రాలేదు. క్రిస్మస్ కి పండుగకు విడుదల చేస్తామని చెప్పిన దిల్ రాజు ఇంత వరకు డేట్ గురించి క్లారిటీ చెప్పలేదు. ఇంకా సినిమా విడుదలకు మూడు నెలలే ఉంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వరుసగా గేమ్ ఛేంజర్ అప్డేట్స్ ఇచ్చారు. ఇంతక ముందు వేరే సినిమాల గురించి అప్డేట్స్ లీక్ చేసిన తమన్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ అప్డేట్స్ లీక్ చేసాడు.సోషల్ మీడియా లో తమన్ గేమ్ ఛేంజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అవ్వనుంది. ఈ మూవీ సినిమా డిసెంబర్ 20న ఆడియెన్స్ ముందుకు రానుంది. అంటే ఇక నుంచి రచ్చ రచ్చే, వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు గేమ్ ఛేంజర్ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్,వరుస అప్డేట్స్ ఉంటాయి.

మీరు కూడా రెడీ గా ఉండండి అని అన్న సంగతి తెలిసిందే.వచ్చే వారమే గేమ్ ఛేంజర్ నుంచి తర్వాత అప్డేట్ రానుంది. మీకు నచ్చుతుంది .. అదిరిపోతుంది కూడా అంటూ అని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలావుండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ లో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. అంతేకాదు ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో వెయ్యికోట్ల కలెక్షన్లు కోల్లగొట్టి నార్త్ బెల్ట్ లో రికార్డ్ సృష్టించిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనున్నాడట. ఈ వార్త నెటింట వైరల్ అవ్వడంతో చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో గెస్ట్ అపీరియన్స్ అంటే నార్త్ బెల్ట్ లోను సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి. సినిమా బ్లాక్ బస్టర్ పక్క అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇటీవల కాలంలో షారుఖ్ ఖాన్, చరణ్ చాలా సన్నిహితంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షారుక్‌ను తన సినిమాలో నటించాలని చరణ్ కోరినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాతో సక్సెస్ అందుకుని బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు చరణ్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే తండ్రికి మించిన తనయుడిగా పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చరణ్.. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: