ఆ యంగ్ హీరో చిత్రంలో డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రి..!

Divya
క్రికెట్ అభిమానులకు డేవిడ్ వార్నర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా పుష్ప సినిమాలోని డైలాగులు, పాటల ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇటీవల పుష్ప-2 నుంచి విడుదలైన డైలాగులు పాటలలోనే స్టెప్పులను కూడా వేస్తూ మరింత క్రేజ్ అందుకున్నారు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా జట్టుకు సైతం ఎన్నో విజయాలను కూడా అందించారు ఈ దిగ్గజ క్రికెటర్. క్రికెట్ లోనే కాదు సినిమాలకు సంబంధించిన రిల్స్ చేయడంలో కూడా దిట్ట అని నిరూపించారు. దీంతో అభిమానులు కూడా తనని ఏదైనా ఒక సినిమాలో నటించమని ఎన్నోసార్లు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయట.

తాజాగా డేవిడ్ వార్నర్ కు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .ఈ ఫోటోలో డేవిడ్ వార్నర్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే తన చేతిలో ఒక గన్ను పట్టుకొని చుట్టూ బాడి గాడ్స్ తో ఉన్నట్టుగా ఒక ఫోటో వైరల్ గా మారుతున్నది.
 ఈ లుక్లో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.. డేవిడ్ వార్నర్ హీరో నితిన్ నటిస్తున్న ఒక చిత్రంలో గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం కావడం చేత ఇలాంటి సడన్ సర్ప్రైజ్ని చిత్ర బృందం ప్లాన్ చేసి ఉండవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి ఇవి రూమర్స్ గా వైరల్ గా మారినప్పటికీ చిత్ర బృందం ఈ విషయం పైన అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది. లేకపోతే డేవిడ్ వార్నర్ స్పందిస్తే కానీ ఈ విషయం పైన ఎలాంటి క్లారిటీ రాదు. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ తో పాటు నితిన్ ఫోటో కూడా వైరల్ గా మారుతోంది. డేవిడ్ వార్నర్ ఎక్కువగా ఇండియన్ సినిమా పాటలకు ,డైలాగులకు రీల్స్ చేస్తూ బాగా అలరిస్తూ ఉంటారు. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరచుకున్నారు డెవిడ్ వార్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: