రజనీకాంత్‌కు అనిరుధ్ అల్లుడు అవుతాడా.. అదెలా..?

Suma Kallamadi
సౌత్ ఇండియన్‌ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచందర్ కూడా ఒకరు. వై దిస్ కొలవరి సాంగ్ తో చిన్న వయసులోనే ఇండియాని ఒక ఊపు ఊపేశాడు. ఇటు తమిళంలో, అటు తెలుగులో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ప్రతి మూవీకీ కూడా ఆయన అందించే మ్యూజిక్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కొన్ని సినిమాల మ్యూజిక్ బాగోలేదని విమర్శలు వచ్చాయి కానీ మిగతా అన్ని సినిమాల మ్యూజిక్ మాత్రం బాగుంటుంది. ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతాయి. ఇటీవల అనిరుధ్ కంపోజ్ చేసిన ‘దేవర’ సినిమా పాటలు విడుదలయ్యే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హిట్ అయ్యాయి.
మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ అప్‌కమింగ్ మూవీ ‘వేట్టయాన్’కు కూడా అనిరుధ్ సంగీత బాణీలు సమకూరుస్తున్నాడు. రీసెంట్ గా దీని నుంచి "మనసిలాయో" పాట రిలీజ్ అయి ఇన్‌స్టంట్ హిట్ అయింది. రజనీకాంత్ అంటే అనిరుధ్‌కు చాలా ప్రేమ ఉందేమో అని అనిపించింది. అంత బాగా, డెడికేటెడ్ గా దీనికి అనిరుధ్‌ సంగీతం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సంగీతం ద్వారా మాత్రమే కాదు మాటలు చేతల ద్వారా కూడా రజనీకాంత్ పట్ల అనిరుధ్‌ ప్రేమ కనబరిస్తున్నాడు.
రజినీ సినిమాల ఆడియో ఫంక్షన్లలో అనిరుధ్‌ ఇచ్చే లైవ్ షోలు, రజినీ గురించి మాట్లాడే మాటలు చూస్తే ఈయనకు ఆయన మీద బాగానే ప్రేమ ఉన్నట్టు తెలుస్తుంది. అంత ప్రేమ కురిపించడానికి ప్రధాన కారణం రజినీ అనిరుధ్‌ కు మామ కావడమే అని తెలుస్తోంది. రజినీ భార్య లత గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆమెకు ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ కుమారుడే ఈ అనిరుధ్. అందుకే సొంత మామ రజనీకాంత్ అంటే ఈ మ్యూజిక్ కంపోజర్ కి చాలా ఇష్టం. నటుడిగా కూడా రజినీకి అనిరుధ్ డై హార్డ్ ఫ్యాన్. అది ఆయన చెప్పకుండానే చెప్పేశాడు. మాటల్లో, సంగీతంల్లో కూడా రజనీ పట్ల ప్రేమ కురిపిస్తున్నాడు. ‘వేట్టయాన్’ ఆడియో వేడుకలో అనిరుధ్ చాలా సందడి చేశాడు. పాటలతో ఆ వేడుకను మరింత సందడిగా మార్చేశాడు. స్పీచ్‌తోనూ అదరగొట్టాడు.
 బేసిగ్గా తాను జాలీ టైప్ అబ్బాయినని కానీ రజినీ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతానని అనిరుధ్ వెల్లడించాడు. ‘జైలర్’ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయని అన్నాడు. రజనీకాంత్ కి ఎప్పుడు కూడా డైహార్డ్ ఫ్యాన్‌గానే ఉంటానని అన్నాడు. ఒక ఫ్యాన్ గానే ఆయన సినిమాలకు మ్యూజిక్ ఆఫర్ చేస్తానని కూడా పేర్కొన్నాడు. ఇకపోతే ఈ మూవీ అక్టోబరు 10న దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: