ఎన్టీఆర్ 'దేవర' బ్లాక్ బస్టర్ కోసం ప్రభాస్ ప్రార్ధనలు..?

murali krishna
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర రిలీజ్‌కు రెడీ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. దేవర ద్వారా బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్‌లు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు నిర్మిస్తున్నారు.ఇదిలావుండగా కొరటాల శివ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. తీసిన సినిమాలని బిగ్ హిట్స్. తన చివరి సినిమా ఆచార్య మాత్రం అంతంత మాత్రమే ఆడింది. దీనితో అతని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మారుతాయా? బిగ్ స్టార్స్ తో సినిమాలు చేజారుతాయా? లేక కొత్త ఆఫర్స్ వస్తాయా? ఇలాంటి ప్రశ్నలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.కొర‌టాల శివ‌ ప్రస్తుతం ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సినిమా దేవర చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే  ఈ సినిమా తర్వాత కొరటాల ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలియాల్సి ఉంది. తనకు మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చి తనను డైరెక్టర్ ను చేసిన ప్రభాస్ తో కొరటాల తన తర్వాత సినిమా ప్లాన్ చేశాడట. కాగా కొరటాల – ప్రభాస్ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ ఆసక్తి కరంగా మారింది. అదేమిటంటే 
 ప్రభాస్ కోసం దర్శకుడు కొరటాల శివ ఓ కథ ను సిద్ధం చేస్తున్నట్లు సిని వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

దేవర పార్ట్ 2 తర్వాత వీరి కాంబోలో సినిమా రానున్నట్లు సమాచారం. గతంలో కొరటాల డైరెక్షన్లో ప్రభాస్ నటించిన మిర్చి సూపర్ హిట్ గా నిలిచింది.అలాగే , మరో సారి ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే ఆ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి. అయితే ఎన్టీఆర్ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా  ఉండబోతుందని టాక్.ఈ నేపథ్యంలో దేవర మూవీ హిట్ కోసం ప్రభాస్ ప్రార్ధనలు చేస్తున్నట్టు సమాచారం.కాగా కొరటాల మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలతో పాపులర్ అయ్యాడు.ఈ నేపథ్యంలో జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌‌లో తెరకెక్కుతోన్న మూవీ కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు ఆచార్య డిజాస్టర్ తర్వాత తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్ధితుల్లో కొరటాల సర్వశక్తులు ఒడ్డి ఈ సినిమాను రూపొందించారు. కథ, స్క్రీన్‌ప్లే, క్యాస్టింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు కొరటాల శివ. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, పోస్టర్స్, పాటలు, ట్రైలర్‌లలో కొరటాల శివ కష్టం కనిపించింది.మరి చూడాలి. దేవర హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్కు , కొరటాల శివకు ఎలాంటి అనుభూతులు ఎదురవుతాయో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: