ఊరికే అయిపోరు మెగాస్టార్.. మరో రికార్డును సాధించిన చిరు..

Suma Kallamadi
మెగాస్టార్ చిరంజీవి.. కొణిదల శివ శంకర వర ప్రసాద్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ గా పేరు పొందిన ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి సినిమాలను చేస్తూ ఆయన అభిమానులను ఉత్తేజపరుస్తూనే ఉంటాడు. ఇదివరకు కొన్నాళ్ల వాడు రాజకీయాలు చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన ఆయనకు తాజాగా ఆరుదైన గౌరవం దక్కబోతోంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చూడు దక్కించుకోబోతున్నారు. ఇక ఈ విషయం సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ గా ఈ ఘనత దక్కించడానికి గల కారణం ఆయన ఎక్కువ సినిమాలలో డాన్స్ చేసి నటించిన దుర్గను ఈ ఘనత దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అధికారికంగా తెలియజేశారు. హైదరాబాద్ మహానగరంలోని ఐటిసి కోహినూర్ హోటల్లో జరిగిన స్పెషల్ ఈవెంట్లో ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. మోస్ట్రోలిఫిక్ సీలింగ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కేటగిరీలో మెగాస్టార్ చిరుకి ఈ అరుదైన గౌరవం దక్కింది. మొత్తం 156 సినిమాలలో 537 పాటలకు గాను 24 వేల డాన్స్ మూవ్స్ వేసినందుకు ఈ గిన్నిస్ రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇప్పటికే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరుని లిఖించుకున్నాడు. 759 సినిమాలలో నటించడంతో ఆయన అప్పట్లో రికార్డు సాధించాడు. ప్రస్తుతానికి ఆ లెక్క మరింతగా పెరిగింది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 155 సినిమాలు పూర్తి చేయగా.. దర్శకత్వంలో 156 వ సినిమాగా విశ్వంభర సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది మెగాస్టార్ చిరు భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు పద్మ విభూషణ్ అవార్డును సొంతం చేసుకున్నా సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఈ రికార్డు సాధించడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: