గ్లామరస్ బ్యూటి అమలా పాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగ చైతన్య బెజవాడ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి పేరు సంపాదించుకుంది. ఆమె అసలు పేరు అనఖ. కేరళలోని ఎర్నాకులంలో జన్మించింది. తండ్రి వర్గీస్ పాల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి అన్నీస్ పాల్ గృహిణి. అమలా పాల్ కు ఒక అన్నయ్య ఉండగా వీరి కుటుంబం కొచ్చిలో స్థిరపడింది. అక్కడే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది.అమలా పాల్ మైనా సినిమాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే తెలుగులోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. అక్కినేని నాగ చైతన్య 'బెజవాడ' అనే చిత్రంతో టాలీవుడ్లోకి పరిచయమైంది. కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఈమె నటించిన 'నాయక్' మినహా 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' సినిమాలు హిట్ కొట్టలేదు.ఇలా ఒక్కో ఇండస్ట్రీలో డెబ్యూ చేసుకుంటూ హీరోయిన్గా ఫేమ్ తెచ్చుకుంది. అలా తమిళంలో అమలాపాల్ నటించిన ఫస్ట్ మూవీ సింధు సామవేళి. అయితే ఈ అమ్మడు అడుగు పెట్టడమే బోల్డ్ చిత్రంతో పెట్టింది. తమిళంలో రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ 2010 సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలైంది. దీనికి డైరెక్టర్ స్వామి దర్శకత్వం వహించారు.
అయితే, సింధు సామవేళి సినిమా విడుదలయ్యాక విపరీతమైన వివాదాస్పదంగా మారింది. దాంతో అమలా పాల్‌పై నెగెటివిటీ రావడమే కాకుండా డైరెక్టర్ స్వామిపై పలు మహిళా సంఘాలు దేహశుద్ధి కూడా చేశారు.
అంత కాంట్రవర్సీ తెచ్చిన సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు అప్పట్లోనే డబ్ చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 10న తెలుగులో విడుదల చేయాలనుకున్న అది కుదరలేదు.ఇదిలా ఉంటే ఇప్పుడు దాదాపుగా 14 ఏళ్ల తర్వాత నేరుగా యూట్యూబ్ లో దర్శనం ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ లోకి వెళ్తే హీరో హీరోయిన్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. హీరో తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. పెళ్లయ్యాక టీచర్ కావాలన్న కలను నెరవేర్చుకోవడానికి కొడుకు సిటీకి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ ఎక్స్ మిలిటెంట్ అయిన తన తండ్రి దగ్గరే భార్యను వదిలేసి వెళ్తాడు. ఆ తరువాత మామ కోడలిపై కన్నేసి ఆమెను లొంగదీసుకుంటాడు. కోడలు ముందుగా అతనికి సపోర్ట్ చేయకపోయినా తరువాత మాత్రం భర్తను మోసం చేస్తూ మామకు అడిక్ట్ అవుతుంది. ఆ తరువాత హీరోకు విషయం తెలిసిపోతుంది. విషయం తెలిసిన హీరో ఏం చేశాడు? హీరోయిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరకు స్టోరీ లో ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది? అనేది తెలియాలంటే నేటి చరిత్ర అనే ఈ సినిమాను చూడాల్సిందే. అప్పట్లోనే ఈ సినిమాను లక్షల్లో బడ్జెట్ పెట్టి నిర్మించారు. గ్లోబల్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై మైఖేల్ రాయప్పన్ ఈ సినిమాకు నిర్మాత గా వ్యవహరించారు. ఇదొక ఏరోటిక్ థ్రిల్లర్ మూవీ కాబట్టి సింగిల్ గా చూస్తే మంచిది అని గుర్తు పెట్టుకోండి.