ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. జనతా గ్యారేజ్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీతో జాన్వీకపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.ఇదిలావుండగా రిలీజ్‌కు మరో వారం రోజులు ఉండగానే ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తో దేవర రికార్డులు క్రియేట్ చేస్తోంది. శుక్రవారం నాటికి దేవర ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పదకొండు కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. రిలీజ్ వరకు రెండు మిలియన్ల అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు పదహారు కోట్లు టార్గెట్ రీచ్ కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఓవర్‌సీస్‌లో హయ్యెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిన టాప్ ఫైవ్ తెలుగు మూవీస్‌లో ఒకటిగా దేవర నిలవడం ఖాయమని అంటోన్నారు.కాగా దేవర రన్‌టైమ్ విషయంలో దర్శకుడు కొరటాల శివతో పాటు మూవీ టీమ్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా రన్‌టైమ్‌ను పదిహేను నిమిషాల పాటు తగ్గించినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. తొలుత దేవర మూవీని రెండు గంటల యాభై ఏడు నిమిషాల రన్‌టైమ్‌తో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నట్లు తెలిసింది.ఈ నేపథ్యంలోనే దూకే ధైర్యమా జాగ్రత్త.. ధైర్యానికే కేరాఫ్ అడ్రస్ గా మారిన దేవరకు ఇప్పుడు ఆ ధైర్యం కోల్పోయి భయం పట్టుకుందేమో అన్నట్టుగా.. తాజాగా సెన్సార్ బోర్డ్ లాక్ చేసిన రన్ టైం చూస్తే అనిపిస్తుంది.ఇక రన్ టైం రోజు రోజుకీ తగ్గిస్తున్న నేపథ్యంలో అటు ఎన్టీఆర్ లో, ఇటు కొరటాల శివ లో కొత్త భయం చుట్టుకుందనే వార్తలు కూడా స్పష్టమవుతున్నాయి.సినిమా రన్ టైం పై దారుణంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. వీటిని దృష్టిలో పెట్టుకొని 2 గంటల 45 నిమిషాలకు లాక్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దీనిని మరింత తగ్గించి 2:32 నిమిషాలకు లాక్ చేసినట్లు తెలుస్తోంది. రెండు గంటల 32 నిమిషాలు అంటే కేవలం రెండున్నర గంట పాటు సాగే ఈ సినిమా అసలు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించగలదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.