70 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఏఎన్ఆర్ సాధించిన రికార్డులివే..!!

murali krishna
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి నటన అంటే ఏంటో పరిచయం చేసిన మహానుభావులు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు వంటి వారు. వీళ్ళు లేనిదే తెలుగు సినిమా లేదు.కాళమ్మ తల్లికి వీళ్ళు చేసిన సేవలు వర్ణనాతీతం. నేడు అక్కినేని నాగేశ్వర రావు గారు జన్మించి 100 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఆ మహానుభావుడి చరిత్ర నేటి తరం యువతకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కినేని నాగేశ్వర రావు గారు మనకి కేవలం ఒక హీరో గా మాత్రమే తెలుసు, కానీ ఆయన బాలనటుడిగా నటించాడని విషయం చాలా మందికి తెలియదు. 1941 వ సంవత్సరం లో ధర్మ పత్ని అనే చిత్రం ద్వారా నాగేశ్వర రావు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఒక పాట లో కనిపించే స్టూడెంట్స్ లో ఒకరిగా ఆయన కనిపిస్తాడు. ఆ తర్వాత ఆయన ‘శ్రీ సీత రామ జననం’ అనే చిత్రం ద్వారా తొలిసారిగా హీరో గా వెండితెర పై కనిపించాడు.ఇదిలావుండగా ఒక రైతు కుటుంబంలో పుట్టి, నాటకరంగం ద్వారా వెండితెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. సుమారు 255 చిత్రాల్లో నటించాడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీజీవితానికి తెరలేచింది. అప్పటినుండి రకరకాల తెలుగు, తమి‌ళ సినిమాలలో 70 సంవత్సరాలకు పైగా నటించాడు. ఎన్. టి. ఆర్తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు.

మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినీరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు. ఎన్టీరామారావు తో కలిసి 14 సినిమాల్లో నటించాడు. దాసరి నారాయణరావు ఎన్.టి రామారావు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్ళని వ్యాఖ్యానించాడు. ఈయన తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు సినిమాలో అరుదైన నటుడిగా గుర్తింపు పొందాడు. వ్యక్తిగతంగా ఆయన నాస్తికుడు. అయినా ఎన్నో భక్తి సినిమాలలో నటించాడు. అలా మొదలైన నాగేశ్వర రావు సినీ ప్రయాణంలో భారత దేశం సినీ అభిమానులు చిత్రస్థాయిగా గుర్తించుకోదగ్గ ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు పోషించి జనాల గుండెల్లో అమరుడు అయ్యాడు. తన చివరి శ్వాస వదిలే వరకు సినిమాల్లో నటిస్తూ ఉండాలి అనేది ఆయన కోరిక. కళామ్మ తల్లి కి ఆయన చేసిన సేవలకు, దేవుడు ఆ కోరిక నెరవేర్చాడు. 

ఆయన చివరి సారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘మనం’. తన కుటుంబ సభ్యులందరితో కలిసి చివరి సినిమా చేసే అదృష్టం ఎంతమందికి కలుగుతుంది చెప్పండి. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యినప్పుడు, డబ్బింగ్ చెప్పే సమయంలోనే నాగేశ్వర రావు గారు అస్వస్థత పాలయ్యారు. బెడ్ మీద పడుకొనే ఆయన డబ్బింగ్ ని పూర్తి చేసాడు. దురదృష్టం ఏమిటంటే ఈ సినిమా విడుదలయ్యే లోపే ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 జనవరి 22న తుది శ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయస్సు 89 ఏళ్ళు. ఇదిలావుండగా నాగేశ్వరరావు పేరు ని చిరస్థాయిగా గుర్తించుకోవాలనే తపనతో అక్కినేని నాగార్జున ఆయన పేరిట అవార్డ్స్ ని ఏర్పాటు చేసాడు.ఈ నేపథ్యంలో శుక్రవారం అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. ఆర్కే సినీ ప్లెక్స్‌లో ఏఎన్నార్‌ శత జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులు, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన తండ్రి నాగేశ్వరరావు నవ్వుతూ జీవించడం నేర్పించారన్నారు. ఈ వారాంతంలో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతోందని.. అన్నపూర్ణ స్టూడియోలో అభిమానులు రక్తదానం చేశారన్నారు. అభిమానుల ఆదరణ మా కుటుంబం ఎప్పుడూ మరిచిపోదన్నారు. రెండేళ్లకోసారి ఏఎన్నాఆర్‌ అవార్డులు ఇస్తున్నామని.. ఈ సారి చిరంజీవికి ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. అక్టోబర్‌ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

anr

సంబంధిత వార్తలు: