పదేళ్ల తర్వాత.. మళ్లీ కలిసి నటించబోతున్న స్టార్ హీరోలు?

praveen
సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే చాలు బాక్సాఫీస్ వద్ద ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. ఒకరకంగా ఇక స్టార్ హీరో సినిమా విడుదల తేదీ రోజున థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా భారీగా కట్ అవుట్ లో ఏర్పాటు చేసి తమ అభిమాన హీరోలకు ఇక పూలదండలు వేసి పాలాభిషేకాలు చేయడం చేస్తూ ఉంటారు. ఇక ఇలా భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ ఉంటాయి. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఇక ఆ సినిమాకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.

 ఒకప్పుడు స్టార్ హీరోలు అందరూ కూడా ఇండివిజువల్ గా సోలోగా సినిమాలు తీసేందుకే ఇష్టపడేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సినిమా కథ కాస్త అటు ఇటు అయినా ఇద్దరు స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ దృశ్య తప్పకుండా విజయాలు సాధిస్తూ ఉన్నాయి. దీంతో దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇలా ఎన్ని మల్టీ స్టారర్ సినిమాలు వచ్చిన కొన్ని కాంబినేషన్స్ మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ ఫేవరెట్ గానే ఉంటాయి.

 ఇక ఇప్పుడు అలాంటి కాంబినేషన్ ఒక క్రేజీ కాంబో పదేళ్ల తర్వాత మరోసారి రిపీట్ కాబోతుంది అన్నది తెలుస్తుంది. మాలీవుడ్ దిగ్గజాలుగా పేరు సంపాదించుకున్న మమ్ముట్టి, మోహన్ లాల్ పదేళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించేందుకు రెడీ అయ్యారు. మహేష్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట. మెజారిటీ షూటింగ్ శ్రీలంకలోనే జరుగుతుంది అన్నది సమాచారం. ఆ తర్వాత కేరళ ఢిల్లీ లండన్ లో చిత్రీకరణ ఉంటుందట. ఈ కాంబినేషన్లో ఇప్పటివరకు దాదాపు 50 సినిమాలు వచ్చాయి. చివరిగా 2013లో వీరిద్దరి కాంబో రిపీట్ కాగా.. ఇక ఇప్పుడు పదేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై  అంతకంతకు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: