జానీ మాస్టర్ కు మరో షాక్.. ఆ పదవి కూడా?

praveen
సౌత్ ఇండియాలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ తనను రేప్ చేశాడని అంతేకాకుండా మానసికంగా శారీరకంగా హింసించాడు అంటూ ఆరోపణలు చేస్తూ ఒక లేడీ డాన్సర్ ఇటీవలే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే లైంగిక ఆరోపణలతో జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇది నిజమా అబద్దమా అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు జాని మాస్టర్ మాత్రం స్పందించలేదు అన్న విషయం తెలిసిందే.

 అయితే లేడీ డాన్సర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే దర్యాప్తును కూడా మొదలుపెట్టారు. కాగా ఇలా అత్యాచారం కేసులో ఇరుక్కున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ తమ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అంటూ జానీ మాస్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ కూడా అత్యాచార ఆరోపణలపై విచారణ చేపట్టాలి అంటూ ఆదేశించింది. ఇక ఇప్పుడు జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తోంది.

 ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జాని మాస్టర్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆ పదవి నుంచి జానీ ని తొలగించడంతోపాటు అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే జానీ మాస్టర్ తనను అత్యాచారం చేశాడంటూ యువతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా.. ఇందుకు సంబంధించి ఎన్నో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కేవలం జానీ మాస్టర్ మాత్రమే కాదు ఆయన భార్య కూడా తనను లైంగికంగా మానసికంగా వేధించారని జానీ మాస్టర్ అత్యాచారం చేయడానికి ప్రోత్సాహించారు అంటూ సదరు లేడి డాన్సర్ ఆరోపణలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: