మోక్షజ్ఞ మొదటి సినిమాకే.. అంత బడ్జెట్టా?
సాధారణంగా ఇలా వారసుల ఎంట్రీ సమయంలో ఎంతో మంది స్టార్ హీరోలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తన కొడుకు మోక్షాజ్ఞ ఎంట్రీ విషయంలో సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్గా నటించబోయేది ఎవరు.. మ్యూజిక్ డైరెక్టర్ సహా అన్ని విభాగాల్లో బాలకృష్ణ ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మోక్షజ్ఞ మొదటి మూవీకి బడ్జెట్ ఎంత ఉంటుందో తెలుసుకునేందుకు అందరిలో ఆసక్తి పెరిగిపోతుంది..
ఇటీవల ఇందుకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ విషయం తెలిసి నందమూరి అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ హీరోగా నటించిన సినిమాను.. ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్లో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత నందమూరి వారసుడు ఎంట్రీ ఉండడంతో ఇక బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని మేకర్స్ కూడా ఆలోచిస్తున్నారట. ఇక ఈ విషయం తెలిసి టాలీవుడ్ సినీ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇప్పటికీ కొంతమంది స్టార్ హీరోలు 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయడం లేదని.. అలాంటిది మోక్షజ్ఞ మొదటి సినిమాకే 100 కోట్ల బడ్జెట్ ఏంటి అని అవ్వాక్కవుతున్నాయి.