'దేవర' కథపై కొరటాల క్లారిటీ... రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా..!!
ఇక దేవర మూవీ స్టోరీ విషయానికి వస్తే.. 1980-90ల నేపథ్యంలో సాగుతుందని, ఓ నాలుగు గ్రామాలు వాళ్ల పూర్వీకుల ఆయుధాలను పూజిస్తూ ఉంటారట. ఇక ఈ గ్రామాల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ స్టోరీ నడుస్తుందట. అంతే కాదండోయ్ ఈ స్టోరీ మెుత్తం ఒకే కుటుంబానికి చెందినదని కొరటాల చెప్పుకొచ్చాడు. దాంతో తారక్-సైఫ్ లది ఒకే ఫ్యామిలీ అన్న రహస్యం కూడా బట్టబయలైంది. అదీకాక సినిమాలో దేవర క్యారెక్టర్ కు ప్రజలందరూ భయపడతారని తెలిపాడు. అలాగే మూవీ రన్ టైమ్ కూడా దాదాపు 3 గంటలు ఉంటుందని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. కొరటాల రివీల్ చేసిన ఈ సీక్రెట్స్ కాస్త వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ తమ బుర్రలకు పదునుపెట్టారు.పూర్వీకుల ఆయుధాలను పూజిస్తున్నారంటే.. సినిమాలో ఊచకోతకు కొదవుండదన్న నిర్ణయానికి వాళ్లు వచ్చేశారు. నాలుగు గ్రామాల మధ్య తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయని ఊహించుకుంటున్నారు. అలాగే సైఫ్ అలీఖాన్-తారక్ ఒకే కుటుంబం అని చెప్పడంతో.. తండ్రి వారసత్వం కోసం ఇద్దరు శత్రువుగా మారి కొట్టుకుంటారని కథను అల్లేస్తున్నారు. మనం ఊహించినదానికంటే సినిమాలో ఊచకోత కాస్తంత ఎక్కువే ఉండేలా ఉందని ఫ్యాన్స్ తో పాటుగా మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. స్టోరీని డైరెక్టర్ కొరటాల శివ కాస్త రివీల్ చేయడంతో.. దేవరపై అంచనాలు ఇంకాస్త పెరిగిపోయాయి.