ప్రభాస్ కు ఆ భయం పోదా.. 'ఛత్రపతి' విషయంలోనూ అదే జరిగిందా..?

murali krishna
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హర్రర్ కామెడీ జోనర్ లో ది రాజాసాబ్ మూవీ సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు మారుతి అస్సలు బ్రేక్ తీసుకోకుండా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారంట.ఇదిలావుండగా బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ మధ్యన ఆదిపురుష్, రాధే శ్యామ్ వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ దర్శక, నిర్మాతల్ని ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోశారు. మళ్లీ ప్రభాస్ ఫామ్‌లోకి వచ్చాడు. సలార్, కల్కి 2898 చిత్రాలతో బాక్సాఫీసును షేక్ చేశాడు. ఢిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులందర్ని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు.అయితే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛత్రపతి’ సినిమాలోని ఓ ఆసక్తికర విషయాన్ని ప్రభాస్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘కెరీర్ స్టార్టింగ్‌లో మైక్ పట్టుకోవడానికి కూడా తడబడేవాడిని.

ఛత్రపతి సినిమా షూటింగ్‌లోనూ చాలా ఇబ్బందిపడ్డాను. ఆ మూవీలో బాజీరావును చంపేసిన ఓ సీన్ ఉంటుంది. ఆయన్ను చంపి, శవాన్ని ఈడ్చుకెళ్లి రాజకీయ నాయకుడైనఅప్పలనాయుడుకు హీరో వార్నింగ్ ఇవ్వాలి. అప్పుడు నేను సెట్‌లో డైలాగ్ చెప్పలేదు. జస్ట్ పెదవులు కదిపాను. డైలాగ్ సైలెంట్‌గా చెబుతానని జక్కన్నతో చెప్పాను.ఓకే అన్నాడు. నేను కేవలం పెదాలు మాత్రమే ఆడిస్తూ డైలాగ్ చెబుతుంటే అక్కడున్నవారికి నేను ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. ఎందుకో నాకే తెలియదు చుట్టూ జనాలు ఉంటే సైలెంట్ అయిపోతాను. మిస్టర్ పర్‌ఫెక్ట్ మూవీ అప్పుడు కూడా ఇలాగే అయ్యింది. మరీ అంతలా సిగ్గుపడితే ఎలా? అంటూ నాతో పనిచేసిన డైరెక్టర్స్ అందరూ రాజమౌళిని తిట్టుకుంటారు. ఆయన వల్లే నువ్వు ఇలా చెబుతున్నావు అని.’ అంటూ ప్రభాస్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. అంటే ఇలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ప్రభాస్ ఇప్పటికీ అలాగే చేస్తాడు అన్నమాట. ఇంత పెద్ద సూపర్ స్టార్ అయ్యుండి కూడా ఇప్పటికీ భయం, బెరుకు పబ్లిక్ ఫంక్షన్స్ లో మాట్లాడేటప్పుడు ప్రభాస్ లో కనిపిస్తుంది కాబట్టి, ఇలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఆయన ఇదే ఫార్ములా ని ఇప్పటికీ అనుసరించడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: