రామోజీ ఫిలిమ్ సిటీ వైపు యూటర్న్ తీసుకున్న రాజమౌళి !
రాజమౌళి ‘బాహుబలి’ కోసం మాహిష్మతి సామ్రాజ్యాన్ని కొన్ని ఎకరాలలో భారీ సెట్ వేసి రామోజీ ఫిలిమ్ సిటీలో నిర్మించిన విషయం తెలిసిందే. ఆసినిమా విడుదలై అనేక సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ రామోజీ ఫిలిమ్ సిటీకి వెళ్ళినవాళ్ళు ఆ మాహిష్మతి సామ్రాజ్య సెట్ ను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రాజమౌళి అలాంటి ప్రయోగమే చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మహేష్ తో తీయబోయే సినిమాలో 18వ శతాబ్దనికి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించి అప్పటి వాతావరణాన్ని కళ్ళకు కట్టేవిధంగా 100 ఎకరాలలో ఒక భారీ సెట్ నిర్మాణం ఇప్పుడు రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతున్నట్లు సమాచారం. ఒక ఆటవిక తెగకు సంబంధించిన 18వ శతాబ్ధం వాతావరణ పరిస్థితులు వారి ఆచారాలు ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉంటాయి అంటున్నారు.
దీనికోశం ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన అనేకమంది ఆర్ట్ డైరెక్టర్స్ నుండి సలహాలు తీసుకుని ఈ భారీ సెట్ నిర్మాణం జరుగుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఈమూవీ అధికారిక ప్రారంభోత్సవం వచ్చేనెల విజయదశమి రోజున జరిపి ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం జనవరి నుండి ప్రారంభం అయ్యేవిధంగా జక్కన్న యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన కీలక నటీనటుల ఎంపిక విషయంలో రాజమౌళి ఆలోచనలు చేస్తున్నప్పటికీ ఈమూవీలో మహేష్ పక్కన నటించే ఇద్దరి హీరోయిన్స్ విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు టాక్..