కొడుకు సినీ ఎంట్రీపై.. క్రేజీ న్యూస్ చెప్పిన సుధీర్ బాబు?
మరోవైపు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా ఈతరం హీరోగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే అటు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మాత్రం మహేష్ బాబు తర్వాత ఇప్పటివరకు ఎవరు హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి గౌతమ్ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనే విషయంపై కూడా అభిమానుల్లో ఆసక్తి ఉంది. అలాగే మహేష్ బాబు బావ సుధీర్ బాబు తనయుడు చరిత్ ఎంట్రీ కోసం కూడా ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అచ్చం మామ మహేష్ బాబు ఆటిట్యూడ్, లుక్స్ కలిగి ఉన్న చరిత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే చూడాలని కోరుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.
ఈ క్రమంలోనే తన కొడుకు చరిత్ సినీ ఎంట్రీపై హీరో సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో నాలుగేళ్లలో చరిత్ డెబ్యు ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు హీరో సుధీర్ బాబు. తను నటించిన మా నాన్న సూపర్ హీరో మూవీ టీజర్ లాంచ్ లో సినీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. మీ కొడుకు సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటూ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మేము ఆపిన చరిత్ ఆగేలా లేడు. ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు అంటూ సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు.