కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమాలు ఎక్కువ శాతం తెలుగులోనే విడుదల అవుతూ ఉండేవి. దానితో మన తెలుగు సినిమాలకు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తే గొప్పగా చెప్పుకునే వాళ్లం. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయి. ఎప్పుడు అయితే బాహుబలి సినిమా విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారీ కలక్షన్లను వసూలు చేసిందో అప్పటినుండి మన తెలుగు మేకర్స్, దర్శకులు, హీరోలు అంతా కూడా పెద్ద స్థాయి సినిమాల వైపు అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా విడుదల అయ్యి భారీ కలెక్షన్లను కూడా రాబట్టాయి.
ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరంలో ఇంకా కొంత కాలమే మిగిలి ఉంది. కానీ ఈ మిగిలి ఉన్న కాలంలో తెలుగు సినీ పరిశ్రమ నుండి భారీ క్రేజ్ ఉన్న మూడు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు కనుక భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నట్లయితే తెలుగు సినీ పరిశ్రమను ఇపట్లో ఆపడం కష్టమే. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదటి భాగం సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ మూడు మూవీలపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాలు కనుక భారీ విజయాలను అందుకున్నట్లు అయితే తెలుగు సినీ పరిశ్రమ క్రేజ్ ఒక్క సారిగా మరింతగా పెరుగుతుంది. మరి ఈ మూడు సినిమాలు ఏ రేంజ్ విజయాలను అందుకుంటాయో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.