బాలీవుడ్ లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.. బాలీవుడ్ బ్యూటీ, మోడల్ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మ హత్య చేసుకున్నారు.ముంబై లో ఈ ఘటన చోటు చేసుకుంది..బుధవారం 2024, సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం.. అనిల్ అరోరా ముంబై లోతాను నివాసం ఉంటున్న బిల్డింగ్ టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.. అనిల్ అరోరా కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ట్రీట్ మెంట్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది.. ఈ విషయం తెలిసిన వెంటనే మలైకా అరోరా ఇతర కుటుంబ సభ్యులు ఆయన ఇంటికి వచ్చారు. పోలీసులు సైతం స్పాట్ కు చేరుకుని విచారణ కొనసాగిస్తున్నారు.. అనిల్ అరోరా ఆత్మహత్యకు కారణాల పై ఆరా తీస్తున్నారు. అనారోగ్యం వల్లే అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు..ఇప్పటివరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు ఈ సందర్భం గా వెల్లడించారు.
ఈ సంఘటన తెలుసుకున్న మలైకా అరోరా మాజీ భర్త అయిన అర్బాజ్ ఖాన్ ఘటన స్థలానికి చేరుకున్నారు..మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అయిన అర్బాజ్ ఖాన్ కు 1998 లో వివాహం జరిగింది.. వీరికి ఆర్హాన్ ఖాన్ అనే కొడుకు కూడా వున్నాడు.. అయితే పెళ్లి అయిన 18 సంవత్సరాలకు వీరి రిలేషన్ షిప్ ను బ్రేక్ చేసుకొని 2016 లో విడాకులు తీసుకున్నారు.. ప్రస్తుతం మలైకా అరోరా అర్బాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చి బోనీకపూర్- మోనాషౌరీ తనయుడు, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తో గత కొంతకాలంగా రిలేషన్ లో వున్నారు..వీరిద్దరికి మధ్య దాదాపు 12 సంవత్సరాల తేడా ఉంది.అయితే వీరి రిలేషన్ షిప్ కూడా బ్రేక్ అయిందంటూ ఇటీవల తెగ వార్తలు వినిపిస్తున్నాయి.