బిగ్ బాస్ 8 లోని ఆ కంటెస్టెంట్ డైరెక్టర్ రాఘవేందర్రావు కూతురని మీకు తెలుసా..?

Pandrala Sravanthi
బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ ప్రారంభమై వారం రోజులు గడిచింది. సెప్టెంబర్ 1న స్టార్ట్ అయిన ఈ సీజన్ కి కూడా నాగార్జుననే హోస్టుగా చేశారు. ఇప్పటికీ హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ రాగా అందులో నుండి నిన్న ఆదివారం జరిగిన ఎపిసోడ్లో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు.. ఇక  ఈ వారం నుండి షో మరింత రంజుగా సాగే అవకాశం అయితే కనిపిస్తోంది.ఇప్పటికే షోలో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయం పక్కనపడితే.. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బిగ్బాస్ 8లో ఉన్న ఒక కంటెస్టెంట్ రాఘవేంద్రరావుకి స్వయాన కూతురు అవుతుందట. మరి ఆ కంటెస్టెంట్ ఎవరా అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు తాజాగా ఎలిమినేట్ అయిన బెజవాడ బేబక్క..అవును మీరు వినేది నిజమే.

ఎందుకంటే బెజవాడ బేబక్కకి రాఘవేంద్ర రావు స్వయాన పెదనాన్న అవుతారట. అలా వరుసకు రాఘవేంద్రరావుకి ఆయన కూతురు అవుతుంది. ఇక వీరి మధ్య సంబంధం ఎక్కడిది అంటే బెజవాడ బేబక్క తల్లి రాఘవేంద్రరావు భార్య ఇద్దరు సొంత అక్క చెల్లెళ్లట.అలా బేబక్క పెద్దమని రాఘవేంద్రరావు పెళ్లి చేసుకున్నారు.అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ వలో స్వయంగా బెజవాడ బేబక్కనే తెలియజేసింది.అంతేకాకుండా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే నెక్కంటి వంశీ బేబక్కకి సోదరుడు అవుతారట.ఈయన పుష్ప,రణరంగం, ఖలేజా వంటి సినిమాల్లో నటించారు.


ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బేబక్క అసలు పేరు మధు నెక్కంటి.. ఇక ఈమె మీలో ఎవరు కోటీశ్వరుడు, ఏ బి సి డి, 24 కిస్సెస్ వంటి సినిమాల్లో నటించింది. అయితే అలాంటి ఈ కంటెస్టెంట్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అవ్వడం కొంతమంది జీవించుకోలేకపోతున్నారు. ఇక బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వడానికి కారణం గత పది రోజుల నుండి వర్షాల కారణంగా ఏపీలో చాలామంది టీవీలు చూడడం లేదు. అంతేకాకుండా విజయవాడ మొత్తం వరదల్లో మునిగిపోయింది. కాబట్టి అక్కడి వాళ్ళు టీవీలు చూడకపోవడం వల్ల బేబక్కకి ఓటింగ్ ఎక్కువగా పడలేదని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: