2024 లో.. అత్యధిక పన్ను చెల్లించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

frame 2024 లో.. అత్యధిక పన్ను చెల్లించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు  సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పడలేదు. అందుకే ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం సోషల్ మీడియాలోకి వచ్చిన కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా సినీ సెలెబ్రిటీల ప్రొఫెషనల్ విషయాలు తెరిచిన పుస్తకంల ఉంటాయి. ఆయా హీరోహీరోయిన్లు ఏ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఆ సినిమాకు దర్శకుడు ఎవరు తోటి సహనటులు ఎవరు అన్న విషయం కూడా ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది. కానీ ప్రేక్షకులు మాత్రం సినీ సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.

 ఈ క్రమంలోనే ఇలా ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న వారి పారితోషకం ఎంత.. ఇక ఇలా సినిమాల ద్వారా వాళ్ళు ఎంత సంపాదించారు. ఎన్ని ఆస్తులు కూడ పెట్టుకున్నారు అనే విషయాలు కూడా ఎప్పుడూ ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతుంటాయి. ఇది నిజమా అబద్దమో తెలియదు కానీ ఇక ఇలాంటి విషయాలను తెలుసుకునేందుకు ఇంటర్నెట్ జనాలు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో ఎక్కువ టాక్స్ చెల్లించిన సినీ సెలబ్రిటీలు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే హీరోయిన్లలో ఇలా ఎక్కువ టాక్స్ చెల్లించిన హీరోయిన్ ఎవరు అని తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు అభిమానులు.

 అయితే ఇలా ఇండియాలో అత్యధిక పన్ను చెల్లించిన మహిళ సినీ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ అగ్రస్థానంలో నిలిచారు. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ఆమె 20 కోట్ల రూపాయల పన్ను చెల్లించారు. ఇక తర్వాత స్థానంలో స్టార్ హీరోయిన్ కియారా 12 కోట్ల టాక్స్ చెల్లించి రెండవ స్థానంలో ఉన్నారు. ఇక తర్వాత కత్రినా కైఫ్ 11 కోట్ల టాక్స్ చెల్లింపు దారుగా ఉండి.. మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఇక హీరోలలో చూసుకుంటే షారుఖ్ఖాన్ 92 కోట్ల పన్ను చెల్లించి అందరికంటే ఎక్కువ పన్నులు చెల్లించిన హీరోల జాబితాలో టాప్ లో ఉన్నారు. ఆ తర్వాత దళపతి విజయ్ 80 కోట్లు సల్మాన్ ఖాన్ 75 కోట్ల టాక్స్ చెల్లించి తర్వాత రెండు స్థానాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: