పవర్ స్టార్ "ఓజీ " కోసం ఆ స్టార్ హీరోని దింపుతున్న మేకర్స్..?

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే సినిమాలలో ఓజీ చిత్రం కూడా ఒకటి.. ఈ సినిమా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ సుజిత్. ఇప్పటికే ఓజి చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ఫ్యాన్స్ కి సైతం.. విపరీతంగా నచ్చింది. దీంతో అభిమానులు ఈ చిత్రం కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఓజి సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్  కేవలం ఏడు రోజులు డేట్స్ ఇస్తే చాలు.. ఈ సినిమాని పూర్తిచేసేలా డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కూడా మిగతా చిత్రాల కంటే ముందే ఓజీ చిత్రాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారట.  ఈ నేపథ్యంలోనే ఓజి సినిమా గురించి…ఒక ఆసక్తికరమైన న్యూస్ వైరల్ గా మారుతోంది. ఈ విషయం విన్న అభిమానులకు పూనకాలు తెప్పించేలా కనిపిస్తోంది.సెప్టెంబర్ 27వ తేదీన ఓజీ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉండగా..ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలి ఉండడంతో విడుదల తేదీని వాయిదా వేశారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక అదిరిపోయే పోస్టర్ తో  తెలియజేశారు. ఇక ఓజి సినిమా పోస్ట్ పోన్..అవ్వడంతో ఈ  సినిమా ప్లేస్ లో దేవర సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మరి అభిమానులైతే ఓజి సినిమా కోసం కచ్చితంగా మరి కొన్ని మాసాలు ఎదురుచూడాల్సిందే.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే ఒకవైపు తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మరొకవైపు తాను నటించాల్సిన సినిమా షూటింగ్లలో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.ఇదిలావుండగా తాజాగా OG సినిమా నుంచి మరో ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ OG సినిమాలో తమిళ్ స్టార్ హీరో శింబు సాంగ్ పాడనున్నాడట. తమిళ్ హీరో శింబు సింగర్ కూడా. ఇప్పటికే తెలుగు, తమిళ్ తో పాటు వేరే భాషల్లో కూడా అనేక సాంగ్స్ పాడాడు. గతంలో తెలుగులో ఎన్టీఆర్, మంచు మనోజ్, నిఖిల్, రామ్.. వంటి హీరోలకు శింబు పాటలు పాడాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం సాంగ్ పాడబోతున్నట్టు సమాచారం.పవన్ OG సినిమాలో శింబు టైటిల్ సాంగ్ పాడతాడని తెలుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: