టాలీవుడ్ యాక్టర్ నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 29న గ్రాండ్‌గా విడుదల కాగా..పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. నాని అభిమానులకు కావాల్సిన వినోదాన్ని పంచుతోంది. ప్రత్యేకించి ఎస్‌జే సూర్య కామిక్ టైమింగ్‌ను మూవీ లవర్స్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సినిమాకి మొదటి ఆట నుంచే కాస్త పాజిటివ్ టాక్ రావడంతో హౌస్ ఫుల్స్ కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా మీద వరుణుడి ఎఫెక్ట్ గట్టిగా పడినట్లుగా తెలుస్తోంది. నిజానికి గురువారం నాడు సినిమా రిలీజ్ అయితే దాదాపు శనివారం నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.ఈ కుండపోత వర్షాలకు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతుంటే ఏపీలో చాలా ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో సర్వైవ్ అవడమే పెద్ద టాస్క్ కాబట్టి సినిమాల వంటి వాటి జోలికి జనాలు వెళ్లడం చాలా కష్టమే. వర్షాలు- వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో చాలా చోట్ల ఫుట్ ఫాల్స్ తగ్గినట్లుగా ట్రేడ్ వర్గాలు తేల్చాయి. అయితే సినిమా యూనిట్ మాత్రం తమది చాలా లాంగ్ రన్ ఉండే సినిమా కాబట్టి ఈ వారం రాకపోయినా వచ్చేవారం రావాల్సిన ఆడియన్స్ ధియేటర్లకు వస్తారని థియేటర్ లోనే సినిమా చూస్తారని నమ్మకంగా చెబుతోంది.
అయితే మరొక ప్రచారం మేరకు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 80% రికవరీ జరిగిపోయింది అని అంటున్నారు. ఆ లెక్కన ఇప్పటికే కొంత సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే. అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.ఇదిలావుండగా తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ పరిస్థితులను ఎదురిస్తూ సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించేందుకు పరుగులు పెడుతున్నది.ఆంద్రా, నైజాంలో తుఫాన్ భీభత్సాన్ని ఎదురించి సరిపోదా శనివారం చిత్రం కలెక్షన్లను సాధించింది. గత మూడు రోజుల కంటే అధికంగా వసూళ్లను సాధించడం రికార్డుగా మారింది. ఈ చిత్రం 4వ రోజున దక్షిణాదిలో భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగులో 9 కోట్ల రూపాయలు, తమిళంలో 1 కోటి రూపాయలు, కేరళలో 40 లక్షలు, కన్నడలో 1.5 కోట్లు, హిందీలో 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో 11 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.