గుడ్‌న్యూస్..ఆ 50 మంది భారతీయుల్లో తెలుగు సెలబ్రిటీలు
ఇండియన్ సినిమాకు అసాధారణ సేవలు అందించిన సత్యజిత్ రే గురించి బిజినెస్ స్టాండర్డ్ తన మ్యాగజైన్‌లో గొప్పగా రాసుకొచ్చింది. అలాగే మొజార్ట్ ఆఫ్ మద్రాస్ మూవీతో భారీ ఫ్యాన్స్‌ను తన సొంతం చేసుకున్న ఏఆర్ రెహ్మాన్ కూడా స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీతో రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. గ్లోబల్ సినిమాలో సత్తా చాటిన ఆయనకు కూడా మ్యాగజైన్‌లో చోటు దక్కింది. ఇకపోతే ఎంఎం కీరవాణి, చంద్రబోస్ లకు కూడా అదే గౌరవం దక్కింది. వీరిద్దరూ తెలుగు సినిమాకు ఎంతో గౌరవాన్ని పెంచారు.
దర్శకుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు గ్లోబల్ వైడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరీలో ఆస్కార్ అందుకుంది. ప్రపంచ దేశాల్లో ఈ పాట అందరికీ కనెక్ట్ అయ్యింది. అందుకే టాప్ 50 మంది జాబితాలో వారిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ జాబితాలో భారతీయ అమెరికన్ అయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్, ట్విటర్ సీఈవోగా పనిచేసిన 40 ఏళ్ల అగర్వాల్ పేరు మొదటి స్థానంలో నిలవడం విశేషం. అలాగే ఈ మ్యాగజైన్ జాబితాలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, జాకీర్ హుస్సేన్, రవిశంకర్, అరుంధతి రాయ్, కిరణ్ దేశాయ్, గునీత్ మోంగా వంటివారు పేర్లు ఉన్నాయి.