అల్లు అర్జున్ ఇక ఆ పార్టీ మనిషేనా.. భయపడినట్టే అయ్యింది..?
- పవన్ డిప్యూటీ సీఎం అయినా కలవని ఐకాన్ స్టార్
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) .
గతవారం, పది రోజులుగా తెలుగు మీడియాలోను, తెలుగు సోషల్ మీడియాలోను అందరూ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఓ ఫంక్షన్‌కు వచ్చిన అల్లు అర్జున్.. తాను ఎక్కడికైనా నచ్చితే వస్తా.. నచ్చిందే చేస్తా.. మనకు కావలసిన వాళ్ల కోసం ఎక్కడికైనా వెళతా.. ఈ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గను అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్లు.. ఇటు సినిమా వర్గాలలోను.. అటు ఏపీ రాజకీయ వర్గాలలో ప్రకంపనలు రేపాయి.
అల్లు అర్జున్ ఎప్పుడు అయితే పవన్ కళ్యాణ్ కు యాంటీగా ఉన్నట్టు కనిపిస్తున్నాడో.. అప్పుడే వైసిపి వాళ్లకు ఫుల్ ఫేవరెట్ అయిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు.. అల్లు అర్జున్ కు గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇదే టైంలో వైసీపీ లో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కూడా బన్నీకి మద్దతుగా మాట్లాడితే.. అల్లు అర్జున్ పై ఇప్పటికే ఉన్న రాజకీయ ముద్ర.. మరింత బలం , శాశ్వతం అవుతుంది అనటంలో సందేహం లేదు.
బన్నీ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. ఇప్పుడు బన్నీని చాలామంది వైసిపి మనిషిగానే చూస్తున్నారు. మొన్న ఎన్నికలలో కూడా ఇటు తన మేనమామ పవన్ కళ్యాణ్.. జనసేన నుంచి పోటీ చేసి గెలిస్తే.. డైరెక్ట్ గా వెళ్లి ప్రచారం చేయలేదు. గెలిచాక కూడా నేరుగా వెళ్లి కలవలేదు.. అభినందించలేదు. అదే తన స్నేహితుడైన శిల్ప రవి కిషోర్ రెడ్డి నంద్యాలలో వైసిపి నుంచి పోటీ చేస్తే.. వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. ఇది ఇక్కడతో ఆగలేదు. ఎన్నికల తర్వాత కూడా బన్నీపై వైసీపీ ముద్ర మరింత బలపడేలా చేస్తోంది.