చాలా సినిమాలలో కూడా కథ మొత్తం సెట్ అయిన తర్వాత కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు. ఆ మార్పుల వల్ల కూడా సినిమా స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఇకపోతే పరుచూరి గోపాలకృష్ణ గారు ఎన్నో సినిమాలకు కథను , మాటలను అందించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కథ , మాటలు అందించిన సినిమాలలో ఎన్నో మూవీ లు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. ఇలా ఈయన మాటలు అందించిన సినిమాలలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీలలో ఇంద్ర సినిమా ఒకటి. ఇక ఇంద్ర సినిమా గురించి ఒకానొక సందర్భంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్పుకొచ్చాడు.
ఇంద్ర మూవీ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ... చిరంజీవి హీరోగా అశ్విని దత్ మూవీ చేయాలి అనుకున్నాడు. అందుకు బి గోపాల్ ని దర్శకుడిగా అనుకున్నాడు. ఇక చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయాలి అని అశ్విని దత్ ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా చిన్ని కృష్ణ , గోపాల్ కి ఆ కథను వినిపించాడు. కానీ అది ఆయనకు పెద్దగా నచ్చలేదు. ఇక నేను కలిసి ఎందుకు నీకు ఆ కథ నచ్చలేదు అని గోపాల్ ను అడిగాను. నేను ఇప్పటికే యాక్షన్ సినిమాలు చేశాను. మళ్లీ ఫ్యాక్షన్ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనే భయం ఉంది అని అన్నాడు. దానితో నువ్వు ఇది వరకు వేరే హీరోతో ఆ జోనర్ మూవీలు చేశావు.
ఇప్పుడు చిరంజీవి తో చేస్తున్నావు. దానికి దీనికి సంబంధం ఉండదు వర్కౌట్ అవుతుంది అన్నాను. దానితో ఆయన కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక ఈ సినిమా కథ మొదటి గోదావరి బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతూ ఉంటుంది. దానితో మేమంతా కూడా ఆ బ్యాక్ డ్రాప్ ను చేంజ్ చేయాలి అనుకున్నాం. దానితో చిన్న కృష్ణ గోదావరి బ్యాంక్ కాకుండా కాశీ బ్యాక్ డ్రాప్ కు ఈ సినిమాను మార్చాడు. వెంటనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని మాకు అనిపించింది అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చాడు.