ఎట్టకేలకు బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత నెలలో ఆయన హీరోగా నటించిన రెండు సినిమాలు విడుదల కాగా, త్వరలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘భలే ఉన్నాడే’ అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది. మనీషా హీరోయిన్ గా నటించింది. జె.శివసాయి వర్ధన్‌ దర్శకత్వం వహించారు.  అయితే రాజ్ తరుణ్ గత కొంత కాలంగా లావణ్యతో వివాదాన్ని ఎదుర్కొంటూనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత నెలలో ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరా సామీ’ అనే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. 

అయితే, ఈ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇప్పుడు ‘భలే ఉన్నాడే’ అనే సినిమాతో థియేటర్లలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ సినిమా కోసం గట్టిగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.   ఇక ఈ సందర్భంగా ఆయన ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి, ఇది ఎంత వరకు నిజం అని అడగగా, దానికి రాజ్ తరుణ్ సమాధానం చెప్తూ 'ఇప్పటి వరకు నా మెడకు చుట్టుకున్న నెగటివిటీ, 

కాంట్రవర్సీలు చాలు. నాకు బిగ్ బాస్ అసలు సూట్ అవ్వదు, నేను అక్కడ ఒక్క రోజు కూడా ఉండలేను' అంటూ చెప్పుకొచ్చాడు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్  . గతం లో ఇలాంటి వివాదాల్లో చిక్కుకొని నా సినిమాలను సరిగా ప్రమోట్ చేయలేకపోయానని, ఇక నుండి నా పూర్తి ద్రుష్టి సినిమాల మీదనే ఉంటుందని రాజ్ తరుణ్ వ్యాఖ్యానించాడు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్  . దీంతో రాజ్ తరుణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: