తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన జోడీలలో బాలకృష్ణ , విజయశాంతి జోడి ఒకటి. వీరి కాంబినేషన్లో మొత్తం 17 సినిమాలు వచ్చాయి. మరి వీరి కాంబోలో వచ్చిన 17 సినిమాలు ఏవి .? వాటిలో ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
బాలకృష్ణ , విజయశాంతి కాంబోలో మొదటగా కథానాయకుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.
వీరి కొరియర్లో రెండవ సినిమాగా పట్టాభిషేకం అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేదు.
బాలకృష్ణ హీరోగా విజయశాంతి హీరోయిన్గా మూడవ సినిమాగా ముద్దుల కృష్ణయ్య మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
బాలకృష్ణ , విజయశాంతి కాంబోలో నాలుగవ సినిమాగా దేశోద్ధారకుడు మూవీ వచ్చింది. ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది.
బాలకృష్ణ , విజయశాంతి కాంబోలో ఐదవ సినిమాగా అపూర్వ సహోదరులు సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
బాలకృష్ణ , విజయశాంతి కాంబోలో ఆరవ సినిమాగా భార్గవ రాముడు సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.
వీరి కాంబోలో ఏడవ సినిమాగా సాహస సామ్రాట్ మూవీ వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
వీరి కాంబోలో ఎనిమిదవ సినిమాగా మువ్వ గోపాలుడు సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
వీరి కాంబోలో తొమ్మిదవ సినిమాగా భానుమతి గారి మనవడు సినిమా వచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
వీరి కాంబోలో వచ్చిన పదవ సినిమా ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
వీరి కాంబోలో వచ్చిన 11 వ సినిమా భలే దొంగ. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
వీరి కాంబోలో 12 వ సినిమాగా ముద్దుల మామయ్య వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత 13 వ సినిమాగా ముద్దుల మేనల్లుడు సినిమా రాగా ఇది మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత విరి కాంబోలో లారీ డ్రైవర్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన తల్లిదండ్రులు సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత వీరి కాంబోలో రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
వీరి కాంబోలో ఆఖరి సినిమాగా నిప్పు రవ్వ మూవీ వచ్చింది. ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది.