ఇండియాలో.. రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం ఇదే.. ఎందుకు లేదో తెలుసా?
సిక్కింలో ఉండే ప్రకృతికి ఎంతటి వారైనా సరే పరవశించిపోవాల్సిందే. అంతలా ఆ రాష్ట్రము ముగ్ధుల్ని ఆకర్షిస్తుంది . అలాగే పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రానికి ఎందుకు రైల్వే సౌకర్యం లేదు అన్న విషయానికి వస్తే ..అక్కడ ప్రతికూల వాతావరణమే ఇందుకు ఒక ముఖ్యమైన కారణం అనే చెప్పాలి. అలాగే ఈ ప్రదేశంలో భూభాగంలో అనేక రకాల ప్రకృతి సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కువగా నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల ఉండడంతో అక్కడ రైల్వే లైన్లు నిర్మిచడం కుదరలేదు. అంతే కాకుండా ఆ ప్రాంతంలో ఎప్పడూ కూడా కొండచరియలు విరిగి పడడం లాంటి ప్రమాదాలు ఎక్కువ. ఇలా అనేక పరిస్థితుల వాళ్ళ ఇప్పటి వరుకు రైల్వే నిర్మాణం ఏర్పాట్లు చేయడనికి కుదరలేదు. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి క్రమంగా మారె అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో మోదీ అక్కడ రైల్వే స్టేషన్కు శంకుస్థాపన కూడా చేసారు. కానీ అది ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఈ సిక్కిం రంగ్పో స్టేషన్ను టూరిజం, డిఫెన్స్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని రైల్వే మేనేజర్ అమర్జీత్ అగర్వాల్ తెలిపారు. చూడాలి మరి అక్కడ రైల్వే లైన్ ఏర్పాటు చేసిన కానీ ట్రైన్ పరుగులు పెట్టె విదంగా వాతావరణం సహకరిస్తుందో లేదో మరి,