పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో ఖుషి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 2001లో వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్‌బస్టర్ అవడంతో పాటు ఓ క్లాసిక్‌గా నిలిచింది. చాలా మందికి ఈ మూవీ ఫేవరెట్‌గా ఉంటుంది. ఖుషి సినిమాకు ఎస్జే సూర్య దర్శకత్వం వహించారు. ఖుషి సినిమాకు సీక్వెల్ వస్తుందా అని పవన్ అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్నేళ్లకు గుర్తు చేశారు హీరోయిన్ ప్రియాంక మోహన్. నేడు (ఆగస్టు 24) జరిగిన సరిపోదా శనివారం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఖుషి 2 గురించి ఆమె ప్రస్తావించారు.ఎస్జే సూర్య కొంతకాలంగా డైరెక్షన్‌ను పక్కనపెట్టి నటుడిగానే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. దీంతో మళ్లీ ఎప్పుడు దర్శకత్వం చేస్తారని సూర్యను హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగానే ఖుషి 2 గురించి అడిగారు.దీనిపై స్పందించాలని కూడా ఆమె అడిగింది. అనంతరం ఎస్ జేసూర్య స్టేజ్ పైకి వచ్చి మాట్లాడారు. అయితే సూర్య మాట్లాడుతుంటే ఫ్యాన్స్ అరుస్తున్నారు. ఖుషి2 చేయాలని, అప్ డేట్ ఇవ్వాలని తెలిపారు. ఈ క్రమంలో చాలా సేపు సూర్యని మాట్లాడనివ్వలేదు. దీంతో ఇబ్బంది పడ్డ ఎస్ జే సూర్య.. హింట్ ఇచ్చే ప్రయత్నంచేశాడు. కానీ ఏం చెప్పలేదు. సీన్ డైవర్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆయన లవ్ కే పరిమితమయ్యాడు. ఖుషీ2 అప్ డేట్ ఇవ్వలేదు.
మరి ఇంతకి ఆయనకు ఆ ఆలోచన ఉందా? లేదా అనేది క్లారిటీ లేదు. మరి ప్రియాంక డిమాండ్‌ని ఎస్ జే సూర్య నెరవేరుస్తాడా? అనేది చూడాలి.ఇదిలావుంటే నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా, ఎస్ జేసూర్య నెగటివ్ రోల్ చేశారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు.ఇందులో ప్రియాంక మోహన్ మాట్లాడుతూ, సినిమాకి పనిచేసిన అనుభావాన్ని పంచుకున్నారు. నానితో రెండో సారి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, అలాగే ఎస్జేసూర్యతోనూ రెండోసారి వర్క్ చేసినట్టు తెలిపింది. ఈసినిమాకి ఆయన ద్వారా చాలా నేర్చుకున్నట్టు తెలిపింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రియాంక మోహన్.. పవన్ తో కలిసి నటిస్తుంది. ఓజీ`లో ఆమె హీరోయిన్గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్‌తో `ఖుషి 2 చేయాలనే డిమాండ్ చేయడం ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. `ఓజీ`కి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. కానీ త్వరలోనే ఈ సినిమాలు పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది