రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన పక్కా కమర్శియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15న విడుదలై బాక్సాఫీస్ వద్ద హెచ్చు తగ్గులతో కలెక్షన్స్ తెచ్చుకుంటోంది.థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ఐదో రోజు కలెక్షన్స్ ఒక్కసారిగా తుస్సుమన్నాయి. అంటే 5వ రోజున ఇండియాలో డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అందుకు సోమవారమే కారణం అని తెలుస్తోంది. సాధారణంగా మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు సైతం వీక్ డే అయిన మండే పెద్దగా కలెక్షన్స్ రావు.అలాంటిది మిశ్రమ స్పందన వస్తోన్న డబుల్ ఇస్మార్ట్‌కు మరింత పేలవంగా కలెక్షన్స్ వచ్చాయి. ఐదో రోజున ఇండియాలో ఈ సినిమాకు రూ. 1.05 కోట్ల నికర వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే నాలుగో రోజుతో పోలిస్తే ఐదో రోజున 34.38 శాతం కలెక్షన్స్ పడిపోయాయి. ఇక ఇండియా వైడ్‌గా మొత్తం 5 రోజుల్లో రూ. 12.8 కోట్ల నెట్ కలెక్షన్స్ డబుల్ ఇస్మార్ట్ మూవీకి వచ్చాయి.ఇస్మార్ట్ శంకర్ మీద ఉన్న నమ్మకంతో బయ్యర్లు దీనికి భారీగా ఖర్చుపెట్టారు. అయితే నిర్మాతతోపాటు హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు అందులో కనీసం 25 పైసలు కూడా తిరిగిరాలేదు. విడుదలైన మొదటి రెండురోజుల్లో కేవలం రూ.11 కోట్లు రాబట్టింది. సినిమాకు అయిన ఖర్చులో తిరిగివచ్చింది 22 శాతం అంటే ఎంత దారుణంగా ఫ్లాపైందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను కొనుగోలు చేసిన నిర్మాత నిరంజన్ రెడ్డికి హనుమాన్ సినిమాద్వారా వచ్చిన లాభాలన్నీ హారతి కర్పూరంలా కరిగిపోయాయి. భారీ నష్టాలు మిగిల్చిన చిత్రం మరో రికార్డును ఈ సినిమా సాధించింది.ఇదిలావుండగా గతంలో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా వచ్చింది. క్రిష్ దర్శకుడు. ఇది కేవలం 28 శాతమే రికవరీ చేసింది. ఆ సమయంలో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ రికార్డును రామ్ సినిమా తుడిచిపెట్టేసింది. ఈ సినిమా తర్వాత పూరీ దర్శకత్వంలోనే వచ్చిన లైగర్ 41 శాతాన్ని రాబట్టింది. చిరంజీవి హీరోగా వచ్చిన భోళాశంకర్ సినిమాకు 33 శాతం, ఆచార్య సినిమాకు 35 శాతం రాబట్టగా, రాధేశ్యామ్ సినిమా 40 శాతం మాత్రమే రాబట్టాయి. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఆడకపోవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఉచితంగానే ఇచ్చారు.