టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంద. భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విజయ్ ఖైదీ గెటప్‌లో ఉన్న లుక్ బయటికొచ్చింది.అయితే VD12లో విజయ్ రెండు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నట్లు ఉన్నాయి. ఇప్పటివరకు విజయ్ చేసిన సినిమాల్లో నార్మల్ లుక్ లోనే కనిపించాడు. కానీ VD12 కోసం విజయ్ మొదటిసారిగా తన లుక్స్ ను మార్చుకుని మేకోవర్ చేసినట్లు కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే టైటిల్ టీజర్ ను డైలాగ్స్ తో కాకుండా వాయిస్ ఓవర్ తో కట్ చేయాలని దర్శకనిర్మాతలు చూస్తున్నారట. దీని కోసం నందమూరి హీరోలైన బాలకృష్ణ, ఎన్టీఆర్ ఎవరో ఒకరితో వాయిస్ ఇప్పించాలని నిర్మాత నాగవంశీ ట్రై చేస్తున్నాడట. వీరిద్దరిలో ఎవరు వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాకు అది పెద్ద ప్లస్ అవుతుంది. VD12ను వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
విజయ్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాల’ని ఎంతో కసితో ఉన్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీకి జూనియర్ ఎన్టీఆర్ తో ఇప్పటికే మంచి అనుబంధం ఉంది. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా చేసినప్పటి నుంచి వారి మధ్య బాండింగ్ ఉంది. అలాగే ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్స్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరో ఒకరితో అయితే కచ్చితంగా VD12 మూవీకి వాయిస్ ఓవర్ చెప్పించే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ కి ఇప్పటికే వేరే సినిమాలకి వాయిస్ ఓవర్ చెప్పిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఛాయస్ గా గౌతమ్ తిన్ననూరి అతనిని ఏమైనా లైన్ లోకి తీసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి బాలకృష్ణ లేదంటే ఎన్టీఆర్ లలో ఎవరు వాయిస్ ఓవర్ ఇచ్చిన కూడా మూవీకి అదనపు బలం అవుతుందని చెప్పవచ్చు. VD12 చిత్రాన్ని 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ది ఫ్యామిలీ మెన్ తో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ఈ VD12 తో మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. అలాగే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి మరో బలం. మరి అతను ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.