కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మంచు విష్ణు. తక్కువ సమయంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. తొలి చిత్రం విష్ణు మూవీ దగ్గర నుండే ఎనర్జిటిక్ ఫెర్మామెన్స్ తో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన పేరునే టైటిల్‌గా మార్చుకుని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు విష్ణు. 2003లో వచ్చిన ఈ సినిమాలో యాక్టింగ్ ఇరగదీసినందుకు బెస్ట్ మేల్ డెబ్యూట్ సౌత్ కేటగిరిలో ఫిల్మ్ ఫేర్ అందుకున్నాడు. ఇక ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు. శిల్పా శివానంద్, నీతూ చంద్ర. మెయిన్ లీడ్ శిల్పా కాగా, నీతూ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించింది. ఈ సినిమాలో వేదికగా పేరు మార్చుకుంది శిల్పా. శిల్పా మరెవ్వరో కాదు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాక్షి శివానంద్‌కు స్వయానా చెల్లెలు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్క క్లిక్ అయినట్లుగా చెల్లెలు క్లిక్ కావడం చాలా అరుదు. ఈమె విషయంలోనూ అదే జరిగింది. బెజవాడ పోలీస్ స్టేషన్ మూవీతో సినీ కెరీర్ స్టార్ చేసిన శిల్పా.. సౌత్ ఆఫ్రికాలో పుట్టినప్పటికీ.. ఆ తర్వాత ఫ్యామిలీ ఇండియాకు వచ్చేయడంతో తను రావాల్సి వచ్చింది. పంజాబ్ యూనివర్శిటీలో ఎంసీఎ చేసిన ఆమె.. సాఫ్ట్ వేర్ డెవలపర్‌గా ఐదేళ్ల పాటు వర్క్ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి.. అమితాబ్, అమీర్ ఖాన్, ఐశ్వర్య రాయ్ వంటి వారితో 40కి పైగా యాడ్స్ చేసింది. ఆ తర్వాత అక్కలాగానే టాలీవుడ్ గడప తొక్కింది. బెజవాడ పోలీస్ స్టేషన్ తర్వాత.. ఆమెకు మంచు మోహన్ బాబు సొంత బ్యానర్లో కొడుకు విష్ణును హీరోగా తెరకెక్కిస్తున్న మూవీకి ఆఫర్ చేయడంతో శిల్పా కాస్త వేదికగా వచ్చి ఆకట్టుకుంది. ఇదే తెలుగులో చివరి సినిమా.
ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది.బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసినప్పటికీ అంతగా క్లిక్ కాలేదు. బుల్లితెరపై ఫోకస్ పెంచింది. అదే సమయంలో పేరు మార్చుకుంది. 2015 ఓహన్నా శివానంద్‌గా రీనేమ్ చేసుకుంది. శిల్ప అనే పేరు కామన్ అని, తనకంటూ ప్రత్యేకమైన పేరుండాలన్న ఉద్దేశంతో నేమ్ ఛేంజ్ చేసుకుంది. పేరు మార్చుకున్న తర్వాత..అడపా దడపా సీరియల్స్, సినిమాలు చేసి ఇండస్ట్రీ నుండి తప్పుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. కానీ అప్పటి శిల్పా శివానంద్‌కు ఇప్పటి ఓహన్నాకు అసలు పోలికలే ఉండవు. ఇప్పుడు చాలా మారిపోయింది ఈ అమ్మడు. ఇక మంచు విష్ణు విషయానికి వస్తే.. ఇప్పుడు పాన్ ఇండియన్ చిత్రం కన్నప్పను తెరకెక్కిస్తాడు. అలాగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా సినీ పరిశ్రమలోని సమస్యలను సాల్వ్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ముఖ్యంగా ఫీమేల్ యాక్టర్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌పై ఉక్కుపాదం మోపుతూ ప్రశంసలు అందుకుంటున్నాడు.