డబుల్ ఇష్మార్ట్ ఫ్లాప్.. డైరెక్టర్ పూరి షాకింగ్ డెసిషన్?

praveen
ఒకప్పుడు అతి తక్కువ సమయంలో సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్టు కొట్టిన పూరి జగన్నాథ్ కు... ఎంతో మంది సాదాసీదా హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన పూరి జగన్నాథ్ కు ఇక ఇప్పుడు టైం అసలు కలిసి రావట్లేదు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి పూరి ఏ సినిమాతో ప్రేక్షకుల  ముందుకు వచ్చిన అది డిజాస్టర్ గానే మిగులుతుంది. చాలా గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్టు కొట్టిన పూరికి ఆ ఆనందం ఎక్కువ రోజులు మిగలలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన లైగర్ మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలి పోయింది.

 డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను అటు కోలుకోలేని దెబ్బ కొట్టింది అని చెప్పాలి. అయితే ఈ మూవీ తర్వాత తనకు మళ్ళీ హిట్ ఇచ్చిన స్మార్ట్ శంకర్ సినిమా నే నమ్ముకున్న పూరి జగన్నాథ్ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాడు. కనీసం ఈ సీక్వెల్ తో అయినా మళ్ళీ హిట్ కొట్టి ట్రాక్ లోకి రావాలని అనుకున్నాడు. ఇటీవల డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. నిర్మాతలకు భారీగానే నష్టాలు వచ్చాయి అని చెప్పాలి. ఏకంగా ఈ సినిమా థియేటర్ హక్కులను 60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి 40 కోట్ల వరకు నష్టం వచ్చిందట.

 ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా ఫ్లాప్ తో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. గతంలో నిరంజన్ రెడ్డికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏకంగా ఆయన బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ సిద్ధమయ్యాడట. తేజ హీరోగా పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ మూవీని నిరంజన్ రెడ్డి బ్యానర్లో చేయాలని పూరి డిసైడ్ అయ్యాడట. కానీ ఇక వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరికి వరుస హిట్ లతో దూసుకుపోతున్న తేజ సజ్జ డేట్స్ ఇస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్  కాన్సెప్ట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు తేజ. మరి పూరి ప్రాజెక్టును తేజ ఓకే చేస్తాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: