బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో రాజ్ కుమార్ రావు ఒకరు. ఈయన మొదటి నుండి కూడా నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న సినిమాలలో నటిస్తూ అనేక విజయాలను అందుకొని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా రాజ్ కుమార్ రావు "స్త్రీ 2" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఆగస్టు 15 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వస్తున్నాయి. ఈ మూవీ అద్భుతమైన రీతిలో కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతూ ఉండడంతో రాజ్ కుమార్ రావు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.
అందులో భాగంగా ఈయన సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వకముందు , మొదటి సినిమా తర్వాత ఎదుర్కొన్న కొన్ని కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ ... 2008 వ సంవత్సరంలో నేను బొంబాయికి వెళ్లాను. 2010 వ సంవత్సరం నా మొదటి సినిమా విడుదల అయింది. నా మొదటి సినిమా విడుదల అయ్యాక కూడా నా దగ్గర డబ్బులు లేవు. నా బ్యాంకు ఖాతాలో కేవలం 18 రూపాయలు మాత్రమే ఆ సమయంలో ఉన్నాయి. నా స్నేహితుడి ఖాతాలో 21 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నాతో పాటు నా స్నేహితులతో కూడా ఒక్క పూట భోజనం చేసేందుకు ఎన్నో కష్టాలు పడ్డాము అని తెలియజేశాడు. నా మొదటి మూవీ కి ముందు నేను వందల సంఖ్యలో ఆడిషన్స్ ఇచ్చాను అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా రాజ్ కుమార్ రావు తెలియజేశాడు.