24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 6 సౌత్ ట్రైలర్స్ ఇవే..!

frame 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 6 సౌత్ ట్రైలర్స్ ఇవే..!

Pulgam Srinivas
విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 6 సౌత్ మూవీ ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం.

గుంటూరు కారం : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 37.68 మిలియన్ వ్యూస్ దక్కాయి.

సలార్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 32.58 మిలియన్ వ్యూస్ దక్కాయి.

లియో : తలపతి విజయ్ హీరో గా త్రిష హీరోయిన్ గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 31.91 మిలియన్ వ్యూస్ దక్కాయి.

ది గొట్ : తలపతి విజయ్ హీరో గా నటిస్తున్న ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... వెంకట్ ప్రభు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 29.28 మిలియన్ వ్యూస్ దక్కాయి.

బీస్ట్ : తలపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు విడుదల 24 గంటల్లో 29.08 మిలియన్ వ్యూస్ దక్కాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.

సర్కారు వారి పాట : మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 26.77 మిలియన్ వ్యూస్ దక్కాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి పరశురామ్ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: