"స్త్రీ 2" ఆపడం కష్టమే.. బాలీవుడ్ స్టార్ హీరోలకే దమ్కి..?

MADDIBOINA AJAY KUMAR
కొం తకాలం క్రితం స్త్రీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా స్త్రీ మూవీ కి కొనసాగింపుగా "స్త్రీ 2" అనే మూవీ ని రూపొందించారు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రద్ధ కపూర్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ హిందీ భాషలో ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను లభించింది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. 

ఈ మూవీ కి ప్రివ్యూస్ ద్వారానే 9.40 కోట్ల నెట్ కలెక్షన్ లు వచ్చాయి. ఇక ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 55.40 కోట్ల నెట్ కలెక్షన్ లు వచ్చాయి. దానితో ఈ మూవీ కి ప్రి వ్యూస్ మరియు మొదటి రోజు తో కలిపి 64.80 కోట్ల నెట్ కలెక్షన్ లు వచ్చాయి. ఇలా ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ వచ్చాయి. ఇకపోతే ఈ సినిమాకు అద్భుతమైన భారీ బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో మరి కొన్ని రోజులు కూడా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి.

ఇది  ఇలా ఉంటే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హిందీ భాషలో చాలా ఏరియాలలో విడుదల అయింది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ కలెక్షన్ లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఇక "స్త్రీ 2" కి అద్భుతమైన టాక్ రావడంతో చాలా రోజుల పాటు ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి , ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: