సొంతూరికి అండగా నిలబడ్డ నాగ్ అశ్విన్.. స్కూల్ కోసం అన్ని రూ.లక్షల సాయం చేశారా?
అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా తాను చేసిన మంచి పని ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు. సొంతూరుకి మేలు జరిగేలా నాగ్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సొంతూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదులను నిర్మించడానికి నాగ్ అశ్విన్ ఏకంగా 66 లక్షల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. స్కూల్ కోసం ఏకంగా ఇంత మొత్తాన్ని ఖర్చు చేయడం సులువైన విషయం కాదు.
తన తండ్రి చదివిన ప్రభుత్వ పాఠశాలకు నాగ్ అశ్విన్ తనవంతు సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఈ విధంగా సొంతూరికి తమ వంతు సహాయం చేస్తే చాలా గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ సైతం తన స్వగ్రామం కోసం గతంలో లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నాగ్ అశ్విన్ సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లాలోని ఐతోల్ కాగా ఈ గ్రామంలో నాగ్ అశ్విన్ తాతయ్య సింగిరెడ్డి పర్వత రెడ్డి పేరుపై ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాలకి నాగ్ అశ్విన్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
నాగ్ అశ్విన్ కు ఈ పాఠశాలతో ప్రత్యేక అనుబంధం ఉందని సమాచారం అందుతోంది. నాగ్ అశ్విన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ పరంగా టాప్ డైరెక్టర్ కాగా భారీ విజయం అందుకున్నా ఈ దర్శకుడిలో అణువంతైనా గర్వం లేకపోవడం కొసమెరుపు.