శోభిత - చైతు పెళ్లి తేదీ ఇదే...!?

Suma Kallamadi
అక్కినేని ఇంట పండగ వాతావరణం నెలకొంది. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో అక్కినేని నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. సడెన్‌గా చైతూ నిశ్చితార్థం జరగడంతో కొందరు షాక్ అయినా ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలియకుండా నిశ్చితార్థ వేడుక జరిగింది. సోషల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్ ఫోటోలు ప్రత్యక్షం అయ్యాక చాలా మంది అది ఫేక్ అని అనుకున్నారు. అయితే నిన్న సాయంత్రం కింగ్ నాగార్జున తన పోస్ట్‌తో ఓ క్లారిటీ ఇచ్చేశారు. నాగచైతన్య, శోభితా నిశ్చితార్థం వేడుకగా సాగిందని అక్కినేని నాగార్జున స్వయంగా ట్వీట్ చేశారు. దీంతో అందరూ ఎంగేజ్‌మెంట్ నిజమేనని అనుకున్నారు. ప్రస్తుతం నెట్టింట చైతూ, శోభితా ఎంగేజ్‌మెంట్ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.
టాలీవుడ్ హీరోయిన్ సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చైతూ మరో హీరోయిన్‌పై మనసు పారేసుకున్నారనే ట్రోల్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే శోభితతోనే చైతూ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. శోభితా, చైతూ ఎంగేజ్‌మెంట్‌కు కేవలం వారి రెండు కుటుంబాలు మాత్రమే హాజరయ్యాయి. ఎంగేజ్‌మెంట్ తర్వాత చై-శోభితా మ్యారేజ్ డేట్‌ను కూడా నాగార్జున ప్రకటించేశారని తెలుస్తోంది. ప్రస్తుతం చైైతూ పెళ్లి తేదీ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వచ్చేనెల అంటే సెప్టెంబర్ 20వ తేదీలోపు నాగచైతన్య, శోభితా పెళ్లి జరుగుతుందని కింగ్ నాగార్జున  చెప్పేశారట. ఇప్పుడు ఈ విషయంపైనే ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సినీ సెలబ్రిటీలను ఆహ్వానించి చైతూ, శోభితల పెళ్లిని కింగ్ నాగార్జున గ్రాండ్‌గా జరిపించాలనుకుంటున్నారట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే పెళ్లి తేది ఎంత వరకూ వాస్తవమో తెలియడం లేదు. అక్కినేని నాగార్జున స్వయంగా చైతూ పెళ్లి తేదీని ప్రకటించే వరకూ దీనిపై క్లారిటీ రాదు. టాలీవుడ్‌లో కూడా దీనిపై చర్చలు గుప్పుమంటున్నాయి. మొత్తానికి ఒంటరిగా ఉన్న నాగచైతన్య మరోసారి ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలిసి ఆయన అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: