పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తిన శ్రియా.. ఎందుకో తెలిస్తే.??
అప్పుడప్పుడు ఈ అందాల తార తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చి సందడి చేస్తోంది.. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఒక జువెలరీ స్టోర్ ప్రారంభోత్సవంలో యాక్ట్రెస్ శ్రియా శరణ్ పాల్గొన్నది. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రిగా అద్భుతాలు చేస్తారని చెప్పుకొచ్చింది. తాజా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపింది.
శ్రియా, పవన్ కళ్యాణ్ కలిసి 'బాలు' అనే సినిమా చేశారు. ఆ సినిమా సెట్లో పవన్ కళ్యాణ్ చాలా నిశ్శబ్దంగా ఉండి, చాలా కష్టపడేవారని శ్రియా తెలిపింది. 'బాలు' సినిమా షూటింగ్ సమయంలో ఒక పాట చిత్రీకరణ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ కాలుకు గాయం అయింది. అయినా ఆయన షూటింగ్ పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పలేదని గుర్తు చేసుకుంది. తన వల్ల ఒకరు నష్టపోవాలని పవన్ ఎప్పుడూ అనుకోరు అని, తాను కష్టపడుతున్న ఇతరుల సంతోషం కోసమే ఇప్పుడు పరితపిస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
శ్రియా గతంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలని కోరుకునేవారని గుర్తు చేసుకుంది. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తన శక్తిని అంతా ఉపయోగించి పని చేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక కెరీర్ విషయానికి వస్తే, శ్రియా చివరిగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమైన 'షో టైమ్' వెబ్ సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం ఆమె తేజ సజ్జాతో కలిసి ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఆమె పవను ఆకాశానికి ఎత్తేసిన మాటలు చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి.