బాలకృష్ణ గురించి అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన బోయపాటి శ్రీను..?

Suma Kallamadi

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో సింహ, లెజెండ్, అఖండ సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు కూడా అఖండ విజయాలు సాధించాయి. వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ హిట్స్ సాధించారు అని చెప్పవచ్చు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరు కలిస్తే స్క్రీన్ బద్దలు అవ్వాల్సిందే. ఆయన యాక్షన్ డైరెక్షన్‌కి, బాలకృష్ణ మాస్ యాక్షన్ కి థియేటర్లలో ఈలలు పడాల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమా కూడా రాబోతోంది. ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
అంతకంటే ముందు NBK 50 ఇయర్స్ ఈవెంట్ జరగనుంది. బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా సెప్టెంబరు 1న హైదరాబాద్‌లో ఓ ఈవెంట్ కండక్ట్ చేయనున్నారు. దీనికి చాలామంది సినిమా ప్రముఖులు రానున్నారు. ఈవెంట్ దగ్గర పడుతున్న వేళ బుధవారం అంటే ఆగస్టు 7న కర్టెన్ రైజర్ ఈవెంట్ (NBK 50 ఇయర్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఈవెంట్ లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "నందమూరి ఫాన్స్, సినిమా ప్రేక్షకులు పేరు బాగుందని జై బాలయ్య అనట్లేదు, దాని వెనుక ఓ ఎనర్జీ ఉంది. జై బాలయ్య అంటే ఎవరికైనా సరే ఎనర్జీ పెరిగిపోతుంది. ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆ ఎనర్జీ కోసమే అందరూ జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తారు." అని చెప్పుకొచ్చారు. బోయపాటి శ్రీను బాలయ్య గురించి ఇచ్చిన ఈ అదిరిపోయే స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హీరో బాలకృష్ణ ఒక్క బోయపాటితో మాత్రమే కాదు ఇతర దర్శకులతో కూడా హిట్స్ అందుకుంటూ ఈ వయసులోనూ కుర్ర హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నాడు. భగవంత కేసరితో తన నటనలోని ఒక కొత్త కోణాన్ని పరిచయం చేశాడు. ఇప్పుడు NBK109 మరో సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: